పొలిటికల్ మూవీకి రాజకీయ సెగ

పొలిటికల్ మూవీకి రాజకీయ సెగ

తమిళనాట రజనీకాంత్ తరవాత విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మాస్ హీరో విజయ్. ఇళయ దళపతి అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ హీరో కిందటి ఏడాది మెర్సల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దీని తరవాత తాజాగా ఎ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్ లో ఓ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. సర్కార్ పేరుతో వస్తున్న ఈమూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగ విడుదలైంది.

ఇందులో సిగరెట్ తాగుతూ రఫ్ లుక్ తో విజయ్ కనిపిస్తాడు. యమా స్టయిలిష్ గా ఉండే ఈ పోస్టర్ అభిమానులకు తెగ నచ్చింది. కానీ ఈ పొలిటికల్ మూవీకి స్టార్టింగ్ లోనే రాజకీయ సెగ తగిలింది. తమిళనాడులోని ఫేమస్ పొలిటీషియన్ అన్బుమణి రాందాస్ విజయ్ కనిపించిన విధానాన్ని తప్పుపడుతున్నాడు. సిగరెట్ తాగడం క్యాన్సర్ కు కారకమని తెలిసీ దానిని ప్రోత్సహించే విధంగా కనిపించడం కరెక్ట్ కాదంటూ విమర్శించాడు. విజయ్ సిగరెట్ తాగకుండా ఉంటే మరింత స్టయిలిష్ గా కనిపించి ఉండేవాడని పంచ్ వేశాడు.

కోట్లాది మంది అభిమానులున్న హీరో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలంటూ అన్బుమణి రాందాస్ సలహా కూడా ఇస్తున్నాడు. ఇంతకుముందు విజయ్ ఓ ఇంటర్వ్యూలో ఇకపై తన సినిమాల్లో సిగరెట్ తాగుతూ కనిపించనని చెప్పిన విషయాన్నీ ప్రస్తావించాడు. ఆ మాట నిలబెట్టుకోవాలని ఇప్పుడు అన్బుమణి రాందాస్ కోరుతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English