ఫ్లాప్‌ హీరోల మధ్య ఇంట్రెస్టింగ్‌ కాంటెస్ట్‌

ఫ్లాప్‌ హీరోల మధ్య ఇంట్రెస్టింగ్‌ కాంటెస్ట్‌

గోపీచంద్‌, సాయి ధరమ్‌ తేజ్‌ ఇద్దరూ కూడా మాస్‌ హీరోలుగా సత్తా చాటుకున్నారు. అయితే మూస సినిమాలతో ఇద్దరూ పరాజయాల ఊబిలో కూరుకుపోయారు. ఇప్పుడీ ఇద్దరూ తమ తదుపరి చిత్రాలతో తిరిగి పూర్వ వైభవం తెచ్చుకోవాలని చూస్తున్నారు. గోపిచంద్‌ నటిస్తున్న పంతం చిత్రం ప్రోమోస్‌ ఆకర్షణీయంగానే వున్నాయి. ఈ చిత్ర నిర్మాతలు కూడా పంతం బాగా ఆడుతుందనే నమ్మకంతో అగ్రెసివ్‌గా ప్రమోట్‌ చేస్తున్నారు.

మరోవైపు తేజ్‌ హీరోగా నటిస్తున్న తేజ్‌ కూడా విడుదలకి సిద్ధమవుతోంది. కరుణాకరన్‌ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రంపై మంచి ఇంప్రెషనే కలుగుతోంది. ఈ చిత్రానికి ఎడతెగకుండా పబ్లిసిటీ దంచి కొడుతున్నారు. విజయవాడ, వైజాగ్‌ అంటూ ఊళ్లు తిరిగేసి మరీ తేజ్‌ని వార్తల్లో వుంచుతున్నారు. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు వ్యవధిలో విడుదలకి సిద్ధం కావడం విశేషం. గోపిచంద్‌ చిత్రాన్ని జులై 5న విడుదల చేస్తామని ముందే ప్రకటించారు.

తేజ్‌ని కూడా వారం వెనక్కి జరిపి జులై 6న ఫిక్స్‌ చేసారు. ఈ రెండిటి మధ్య పోటీ వుండకూడదని ఇరువురు నిర్మాతలు చర్చించుకున్నారే కానీ ఇంకా ఎవరూ వెనక్కి తగ్గలేదు. రానున్న వారం రోజుల్లో ఎవరూ వెనక్కి వెళ్లకపోతే మాత్రం పోటీ అనివార్యం. అసలే హిట్టు తప్పనిసరి అనే సిట్యువేషన్‌లో వున్న ఇరువురికీ ఇది ఇరకాటమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు