టీజర్‌తో ఎమోషన్ పిండేశారు

టీజర్‌తో ఎమోషన్ పిండేశారు

బాలీవుడ్లో కొన్నేళ్లుగా స్పోర్ట్స్ బయోపిక్‌లు, స్పోర్ట్స్ డ్రామాలు వరుస కడుతున్నాయి. వాటిలో చాలా వరకు మంచి విజయం సాధించాయి కూడా. ఈ వరుసలోనే రాబోతున్న చిత్రం ‘గోల్డ్’. ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు దేశానికి తొలి స్వర్ణాన్ని అందించిన వైనాన్ని స్ఫూర్తిదాయకంగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తోంది రీమా కగ్తి. అక్షయ్ కుమార్ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్ర టీజర్ తాజాగా రిలీజైంది. తక్కువ నిడివితోనే బలమైన ఇంపాక్ట్ చూపించేలా ఉంది టీజర్.

ముందుగా జాతీయ గీతం రాబోతోంది లేచి నిలబడండి అంటూ కాషన్ ఇచ్చి.. తర్వాత బ్రిటిష్ జాతీయ గీతం వినిపించి షాకిస్తారు. ఆపై మీ ఫీలింగ్ ఎలా ఉంది అని ప్రశ్నించి... ఇండియాలో బ్రిటిష్ పాలన సాగిన 200 ఏళ్ల పాటు భారతీయులంతా ఇలాగే నిలుచున్నారంటారు. ఐతే ఒక వ్యక్తి కల.. భారతీయ జాతీయ గీతం వినిపించినపుడు బ్రిటిష్ వాళ్లు లేచి నిలబడేలా చేసిందంటూ అక్షయ్ కుమార్‌ను చూపిస్తారు. ఆ తర్వాత సినిమాలోని షాట్లు కుప్పలు కుప్పలుగా వచ్చిపడతాయి. మొత్తంగా ఈ టీజర్ చాలా ఎమోషనల్‌గా అనిపిస్తోంది.

1948 ఒలింపిక్స్‌లో మన హాకీ జట్టు స్వర్ణం గెలవడం భారత క్రీడా చరిత్రలోనే గొప్ప మైలురాయి. స్వాతంత్ర్యం తర్వాత భారత్‌ ఆడిన తొలి ఒలింపిక్స్‌లో సాధించిన స్వర్ణం కావడం ఇది చరిత్రలో నిలిచిపోయింది. ఐతే ఈ పతకం వెనుక ఉన్న కష్టాన్ని ‘గోల్డ్’లో చూపించబోతున్నారు. ఇంతకుముందు అమీర్ ఖాన్ కథానాయకుడిగా ‘తలాష్’ తీసిన రీమా.. ఆ తర్వాత తీస్తున్న సినిమా ఇదే. దర్శకుడు, నటుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు