పెళ్లి చేసుకుని తప్పు చేశానంటున్న హీరోయిన్

పెళ్లి చేసుకుని తప్పు చేశానంటున్న హీరోయిన్

90ల్లో భారతీయ కుర్రకారుకు నిద్ర లేని రాత్రులు మిగిల్చిన కథానాయిక మనీషా కొయిరాలా. పాలరాతి శిల్పంలా ఉండే ఈ నేపాల్ బ్యూటీ చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రతి చిత్రంలోనూ తన అందంతో బలమైన ముద్ర వేసింది. కొన్నేళ్ల కిందటే మనీషా తన దేశానికే చెందిన దహల్ అనే ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడింది.

కానీ ఆ పెళ్లి ఎంతో కాలం నిలబడలేదు. రెండేళ్లు తిరిగేసరికే అతడి నుంచి మనీషా విడిపోయింది. ఐతే ఈ పెళ్లి విఫలం కావడంలో తప్పు తనదే అని అంటోంది మనీషా. పెళ్లి చేసుకోవడం తాను జీవితంలో చేసిన అతి పెద్ద తప్పని ఆమె అంది. ఈ తప్పు ఇంకోసారి చేయనని.. జీవితాంతం ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నానని మనీషా స్పష్టం చేసింది.

తన జీవితాన్ని మరో వ్యక్తి చేతుల్లోకి వెళ్లనివ్వడం ద్వారా తాను మరింత వెనుకబడాలని అనుకోవట్లేదని మనీషా స్పష్టం చేసింది. తన జీవితంలో ప్రేమ.. పెళ్లి లాంటి పదాలకు చోటు లేదనే చేదు నిజాన్ని తాను జీర్ణించుకుంటున్నానని.. కాబట్టి మరో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఎంత మాత్రం లేదని మనీషా స్పష్టం చేసింది. ఐతే ఒక బిడ్డను దత్తత తీసుకోవాలని అనిపిస్తోందని.. కానీ అందుకు ఇది సరైన సమయంగా భావించడం లేదని చెప్పింది.

బిడ్డను దత్తత తీసుకుంటే తనకు పూర్తి సమయం కేటాయించాల్సి ఉంటుందని.. ఇప్పుడు తాను అలాంటి పరిస్థితుల్లో లేనని.. కాబట్టి తనకు న్యాయం చేయగలను అనుకున్నపుడు బిడ్డను దత్తత తీసుకుంటానని మనీషా చెప్పింది. సంజయ్ దత్ జీవిత కథతో తెరకెక్కిన ‘సంజు’లో దత్ తల్లి నర్గీస్ పాత్రలో మనీషా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English