గ్యాంగ్ లీడర్ రీమేక్ కు ఓకే అనేశాడా?

గ్యాంగ్ లీడర్ రీమేక్ కు ఓకే అనేశాడా?

క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ అంటే.. మూడు దశాబ్దాల క్రితం వరుసగా మెగాస్టార్ తోనే సినిమాలు ఉండేవి. అభిలాష.. ఛాలెంజ్.. రాక్షసుడు.. మరణ మృదంగం.. ఇలా తమ తొలి 4 సినిమాలను చిరుతోనే తీశారు నిర్మాత కేఎస్ రామారావు. అయితే.. స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ ఫ్లాప్ తర్వాత అంతరం పెరిగింది. ఆ సినిమా పరాజయానికి కారణం తానే అంటూ.. రీసెంట్ గా జరిగిన తేజ్ ఐ లవ్యూ ఆడియో రిలీజ్ వేడుకలో చిరంజీవి చెప్పారు.

ఆయన తన స్పీచ్ లో అనేక ఆసక్తికరమైన మాటలు చెప్పడమే కాదు.. మధ్యమధ్యలో కొన్ని హింట్స్ కూడా ఇస్తూ ఉంటారు. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కేఎస్ రామారావు నిర్మాతగా రామ్ చరణ్ మూవీ తప్పక ఉంటుందని చెప్పారు చిరు. రాజమౌళితో సినిమా తర్వాత.. చెర్రీ చేయబోయే సినిమా ఇదే అని కూడా అన్నారు మెగాస్టార్. ఇంత పర్ఫెక్టుగా టైమింగ్ ను కూడా చిరు డిసైడ్ చేశారంటే.. అంతకంటే ముందు చాలానే గ్రౌండ్ వర్క్ జరిగిందనే టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న ప్రాజెక్టే ఇది అంటున్నారు. గ్యాంగ్ లీడర్ టైటిల్ పై.. దాదాపుగా అదే కథాంశాన్ని ఈ జనరేషన్ కు తగిన విధంగా మార్చి రూపొందిస్తారట. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేయాలనే విషయంలో.. నిర్ణయాన్ని పూర్తిగా నిర్మాతకే ఇచ్చేశారని తెలుస్తోంది. చిరు-కేఎస్ రామారావులు డిస్కస్ చేసుకోవడమే కాదు.. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలనే ఆలోచన మెగా పవర్ స్టార్ ను కూడా మెప్పించిందని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English