హరీశ్ శంకర్ ను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటే

హరీశ్ శంకర్ ను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటే

'గబ్బర్ సింగ్' సినిమాతో తన సత్తా చాటుకున్న దర్శకుడు హరీశ్ శంకర్. ఆ సినిమా తరువాత కాకపోతే భారీ సౌండింగ్ వచ్చే రేంజులో హిట్టు కొట్టలేదు. కాకపోతే వరుసగా తన మాటల గారడీతో పెద్ద పెద్ద సినిమాలు బాగానే చేశాడు. ఆడియన్స్ ను కూడా ఇంప్రెస్ చేశాడు. ఈ మధ్యనే డిజె సినిమాతో.. యావరేజ్ కంటెంట్ ను కోట్ల రూపాయల కలక్షన్లు తెచ్చేలా మార్చేశాడు. అందుకే అతడిని కన్సల్టెంట్ గా చేసేశారట దిల్ రాజు అండ్ కో.

నిజానికి ఒకేసారి నాలుగైదు సినిమాలను రూపొందించడంలో దిల్ రాజు నేర్పరి. ఇప్పటికప్పుడు ఆయన చేతిలో ఏకంగా నాలుగు సినిమాలు ప్రొడక్షన్లో రెండు ప్రీ ప్రొడక్షన్లో ఉన్నాయి. వీటన్నింటి కోసం ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా వెంటనే హరీశా అంటూ ఆయన జపం చేస్తున్నారని ఇండస్ర్టీ టాక్. అలాగే వంశీ పైడిపల్లి ఇంట్లో పార్టీ అయినా.. సమ్మోహనం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా.. నా పేరు సూర్య కోసం అల్లు అర్జున్ ను ఇంటర్యూ చేయాలన్నా.. వేరే సినిమాల షూటింగులో సరదాగా ఓ మనిషి కావాలన్నా.. అన్ని చోట్లా హరీశ్ శంకరే కనిపిస్తున్నాడు. అతను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ చాలా బాగుంటాయని ఈ రేంజులో అందరూ ఎంకరేజ్ చేస్తున్నారట.

మొత్తానికి ఈ కన్సల్టెంట్ అవతారంలో ఉన్న హరీశ్‌ ఇప్పుడు సతీశ్‌ వేగేశ్న తీస్తున్న శ్రీనివాస్ కళ్యాణం షూటింగులో ఉన్నాడు. అమలాపురంలో వాని చినుకుల మధ్యన కొబ్బరి చెట్ల సయ్యాటను ఎంజాయ్ చేస్తున్నాడట. అదంతా సరే.. మన సినిమా ఎప్పుడు హరీశ్‌ బాబు? బన్నీతో ఒక ప్రాజెక్ట్ రెడీ అవుతోంది అంటున్నారు.. అది నిజమేనా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English