అక్కినేని కోడలికి అందుకే ప్రేమ

అక్కినేని కోడలికి అందుకే ప్రేమ

టాలీవుడ్ టాప్ బ్యూటీ సమంత.. అక్కినేని వారి ఇంటి కోడలుగా మారి.. 9 నెలలు దాటింది. ప్రస్తుతం ఈమె హైద్రాబాద్ లోనే మకాం ఉంటోంది. పెళ్లికి ముందు కూడా సామ్ ఇక్కడే ఎక్కువగా నివాసం ఉండేది. సొంతూరు చెన్నై అయినా.. తమిళంలో కూడా సినిమాలు చేసినా.. సమంతకు హైద్రాబాద్ అంటే బాగా లవ్ ఎక్కువ.

ఇందుకు ఆమె చెప్పే కారణాలు కొన్ని ఉన్నాయి. ఇంతకీ సమంతకి హైద్రాబాద్ అంటే తరగని ప్రేమ కలగడానికి కొన్ని కారణాలు ఉన్నాయట. నాగ చైతన్య కాకుండా.. ఇక్కడ రెండు అంశాలు సమంతను లవ్వులో ముంచేశాయట. వీటిలో ఒకటి హైద్రాబాదీ ఫుడ్. ప్రస్తుతం చైతు- సమంత గచ్చిబౌలి పరిసరాల్లో నివాసం ఉంటున్నారు. ఈ ఏరియాలో ఎన్నో రకాల ఫుడ్స్ లభిస్తాయి. రుచి తెలియాలే కానీ.. అన్ని రకాల ఫుడ్స్ అందించే రెస్టారెంట్స్ గచ్చిబౌలి పరిసరాల్లో ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతం అన్నా.. ఇక్కడి ఫుడ్ కోర్టులు రెస్టారెంట్లు అన్నా సమంతకు తెగ ఇష్టం అని తెలుస్తోంది.

హైద్రాబాద్ లో సామ్ ను మైమరపించిన మరో పాయింట్ కేబీఆర్ పార్క్. సిటీ నడిమధ్యలో ఇంతటి అట్రాక్టివ్ పార్క్ కనిపించడం చాలా అరుదు. అందుకే సెలబ్రిటీలు అంతా కేబీఆర్ పార్కులోనే చక్కర్లు కొడుతూ ఉంటారు. సమంతకు కూడా ఇక్కడ సమయం గడపడం చాలా ఇష్టం అని తెలుస్తోంది. హైద్రాబాద్ వ్యక్తిని మాత్రమే కాకుండా ప్రదేశాలను కూడా ప్రేమించేసిన సమంత.. ఇక్కడే సెటిల్ అవాల్సి రావడం అదృష్టమే కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు