‘సంజు’ నుంచి ఒక సెన్సేషనల్ పోస్టర్

‘సంజు’ నుంచి ఒక సెన్సేషనల్ పోస్టర్

ఈ ఏడాది బాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ‘సంజు’ ఒకటి. సీనియర్ హీరో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా గ్రేట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని తెరకెక్కించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా మొదలైనపుడు మామూలుగానే అనిపించింది కానీ.. సంజయ్ దత్‌గా రణబీర్ కపూర్ లుక్స్ చూశాక.. ఆపై టీజర్ రిలీజయ్యాక కథ మారిపోయింది. ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

హిరాని మరోసారి మ్యాజిక్ చేయబోతున్నాడనే భరోసా ప్రేక్షకులకు కలిగింది. ఇంకో నెల రోజుల్లోనే ‘సంజు’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టీజర్ రిలీజయ్యాక తరచుగా ఈ చిత్రం నుంచి ఆసక్తికర పోస్టర్లు రిలీజ్ చేస్తూ హైప్ పెంచుతున్నాడు హిరాని. తాజాగా ఆయన పంచుకున్న పోస్టర్ భలే ఆసక్తి రేకెత్తిస్తోంది.

హిరాని చివరి సినిమా ‘పీకే’లో కథానాయికగా నటించిన అనుష్క శర్మ కూడా ‘సంజు’లో ఓ అతిథి పాత్ర చేస్తోంది. ఆమె పోస్టరే హిరాని లాంచ్ చేసింది. డిఫరెంట్‌ లుక్‌లో ఉన్న అనుష్కను చూపిస్తూ ఆమె సినిమాలో ఏ పాత్ర చేసిందో కనుక్కోండంటూ నెటిజన్లకు పరీక్ష పెట్టాడు హిరాని. ఐతే ఆ పరీక్ష అంత కష్టమైందేమీ కాదు. అనుష్క లుక్ చూస్తే అందరికీ 90ల్లో కుర్రకారును ఒక ఊపు ఊపిన మాధురీ దీక్షితే గుర్తుకొస్తోంది. మాధురిని సంజయ్ దత్ గాఢంగా ప్రేమించాడని.. ఆమె ప్రేమ కోసం పరితపించాడని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి.

ఈ నేపథ్యంలో వాళ్ల బంధాన్ని సినిమాలో ఎలా చూపిస్తారన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది. సంజయ్ తనకు క్లోజ్ ఫ్రెండ్ అయిన నేపథ్యంలో అతడి కథను హిరాని ఎంత నిజాయితీగా చూపిస్తాడనే సందేహాలు ముందు నుంచి ఉన్నాయి. కానీ టీజర్ చూస్తే మాత్రం సాధ్యమైనంత వరకు ఉన్నదున్నట్లుగానే చూపిస్తాడని.. సంజు జీవితంలోని మంచి-చెడు రెండూ సినిమాలో ఉంటాయని నమ్మకం కలిగింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు