రవితేజ పరువు గంగ పాలు

రవితేజ పరువు గంగ పాలు

రవితేజ సినిమాతో పోటీ పడిన నాగశౌర్య ఫిబ్రవరిలో పైచేయి సాధించాడు. 'టచ్‌ చేసి చూడు' డిజాస్టర్‌ అయితే, ఛలో బ్లాక్‌బస్టర్‌ అయింది. అయితే సినిమా టాక్‌ని బట్టి రిజల్ట్‌ అలా వచ్చిందని సరిపెట్టుకోవచ్చు. ఆ రిజల్ట్‌ ఇచ్చిన కాన్ఫిడెన్సో ఏమో గానీ మరోసారి రవితేజ చిత్రానికి పోటీగా నాగశౌర్య చిత్రాన్ని రిలీజ్‌ చేసారు. 'ఛలో' మాదిరిగా ఈసారి 'అమ్మమ్మగారిల్లు'కి విడుదలకి ముందు క్రేజ్‌ లేకపోయినా కానీ 'నేల టికెట్‌' లాంటి మాస్‌ చిత్రానికి ఎదురుగా విడుదల చేసారు.

పబ్లిసిటీ పరంగా ఏమాత్రం కేర్‌ తీసుకోని 'అమ్మమ్మగారిల్లు' యావరేజ్‌గానే వున్నా 'నేల టికెట్‌' కంటే బెటర్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో 'అమ్మమ్మగారిల్లు' చిత్రానికి 'నేల టికెట్‌' కంటే మెరుగైన వసూళ్లు యుఎస్‌లో వస్తున్నాయి. రవితేజ చిత్రం కావడంతో 'నేల టికెట్‌'కి ప్రీమియర్ల నుంచి నలభై వేల డాలర్లు వసూలయ్యాయి. కానీ శుక్ర, శనివారాల్లో 'అమ్మమ్మగారిల్లు' సినిమా కంటే తక్కువ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్‌ కలక్షన్లు చూసుకుంటే 'అమ్మమ్మగారిల్లు' కేవలం రెండు వందల డాలర్లు మాత్రమే వెనకబడి వుంది. ఆదివారంతో ఆ మార్జిన్‌ కూడా దాటేసి లీడ్‌లోకి వచ్చేస్తుంది.

భారీ పెట్టుబడితో తీసిన రవితేజ సినిమా కంటే దాంట్లో నాలుగు వంతుల పెట్టుబడి లేని నాగశౌర్య సినిమాకి ఎక్కువ వసూళ్లు వస్తుండడం మాస్‌ మహారాజా ప్రతిష్టకి భంగమే. రెండు వరుస డిజాస్టర్లతో దెబ్బతిన్న రవితేజ త్రిపాత్రాభినయం చేస్తోన్న 'అమర్‌ అక్బర్‌ ఆంటోని'తో అయినా తిరిగి  పరువు నిలుపుకుంటాడో లేదో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు