ఈ భారీ బడ్జెట్ లో బెల్లంకొండ వాటా ఎంత?

ఈ భారీ బడ్జెట్  లో బెల్లంకొండ వాటా ఎంత?

టాలీవుడ్లో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్థానం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. పెద్ద పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న యంగ్ హీరోల సినిమాల్లో కనిపించని భారీతనం అతడి సినిమాల్లో కనిపిస్తుంటుంది. పేరు మోసిన దర్శకులు.. హీరో హీరోయిన్లు.. టెక్నీషియన్లు అతడి సినిమాలకు పని చేస్తుంటారు. మామూలుగా హీరోల మార్కెట్‌ను బట్టే ఏదైనా సెట్టవుతూ ఉంటుంది. కానీ శ్రీనివాస్ ఇంకా హీరోగా పెద్ద నిలదొక్కుకోలేదు. మార్కెట్ సంపాదించుకోలేదు. కానీ అతడి ప్రతి సినిమాకూ భారీ కాంబినేషన్లు కుదురుతుంటాయి. సినిమాలు కూడా భారీ స్థాయిలోనే తెరకెక్కుతుంటాయి. వాటి బడ్జెట్ లెక్కలు.. బిజినెస్ వ్యవహారాలకు పొంతన కనిపించదు. ఇప్పటిదాకా శ్రీనివాస్ నటించిన ప్రతి సినిమా కాస్ట్ ఫెయిల్యూరే. అయినప్పటికీ తగ్గే ప్రసక్తే ఉండదు. అలాగని శ్రీనివాస్‌ సొంత సినిమాలు చేస్తున్నాడా అంటే అదీ లేదు. తొలి సినిమా మినహా అన్నీ బయటి బేనర్లకే చేస్తున్నాడు.

ఇతడి కోసం నిర్మాతల వేలం వెర్రేంటో అర్థమై చావదు. కానీ ఇండస్ట్రీ అంతర్గత వర్గాల సమాచారం ఏంటంటే.. శ్రీనివాస్ ప్రతి సినిమాకు ఆయన తండ్రి బెల్లంకొండ సురేష్ తన వంతుగా ఇంత అని బడ్జెట్ కేటాయిస్తాడు. అది ఉచితం అనుకోవాలన్నమాట. దాని కోసం వాటా ఏమీ ఇవ్వాల్సిన పని లేదు. అలాగే శ్రీనివాస్‌కు పారితోషకం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రెండు మినహాయింపుల తర్వాత అయ్యే ఖర్చును నిర్మాత పెట్టుకోవాలి. దాని మీద ఎంత సంపాదించుకున్నా ఓకే. ఇంకా శ్రీనివాస్‌తో సినిమా చేయడం వల్ల కలిగే అదనపు ప్రయోజనం.. థియేటర్లు సమకూర్చడం.. ప్రమోషన్లు లాంటివి కూడా సురేష్ చూసుకుంటాడు. ఈ ఒప్పందం ప్రకారమే అతడితో భీమనేని శ్రీనివాసరావు ‘స్పీడున్నోడు’ తీశాడు. మిర్యాల రవీందర్ రెడ్డి కూడా ఇదే తరహాలో ‘జయ జానకి నాయక’ చేశాడు.
 
‘స్పీడున్నోడు’ అట్టర్ ఫ్లాప్ కాగా.. ‘జయ జానకి నాయక’ కాస్ట్ ఫెయిల్యూర్ అయింది. అయినా ఆ చిత్రాల నిర్మాతలకు నష్టాలేమీ రాకపోవడానికి సురేష్ అండే కారణమంటారు. ఇక శ్రీనివాస్ కొత్త సినిమా ‘సాక్ష్యం’ విషయంలోనూ ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. దీనికి ఆర్టిఫిషియల్ హైప్ తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. దిల్ రాజు పోటీ పడి ఈ చిత్ర నైజాం హక్కుల్ని తీసుకోవడంలో మతలబు అదే. ఇక ఈ చిత్రానికి భారీ బడ్జెట్ అయినట్లు చెబుతున్నారు. కానీ మూడింట రెండొంతులు మాత్రమే బిజినెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐతే ఇందులో మిగతా ఒక వంతు వాటాను బెల్లంకొండ వారు భరించి నిర్మాతకు నష్టం రాకుండా చూసుకున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English