పిక్ టాక్: సెక్సీ లుక్కా? స్వఛ్ భారతా?

పిక్ టాక్: సెక్సీ లుక్కా? స్వఛ్ భారతా?

మెట్ గాలా 2018.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆకర్షిస్తున్న అందాల ఈవెంట్. న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ మ్యూజియంలో కాస్ట్యూమ్ ఇనిస్టిట్యూట్ గాలా.. ప్రతీ ఏటా ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. 1948లో ప్రారంభమైన ఈ ఈవెంట్ కు.. ఫ్యాషన్.. ఫిలిం.. మ్యూజిక్.. ఆర్ట్.. ఇలా అనేక రంగాలకు చెందిన ప్రముఖలు వస్తారు.

ఇండియా నుంచి కూడా పలువురు మెట్ గాలా 2018కు అటెండ్ కాగా.. ప్రపంచంలో అతి పెద్ద ఫ్యాషన్ ఈవెంట్స్ లో ఒకటిగా పేరు గాంచిన ఈ ఈవెంట్ లో.. బాలీవుడ్ అందాల భామ దీపికా పదుకొనే కూడా సందడి చేసింది. రెడ్ కలర్ డిజైనర్ డ్రెస్సులో అమ్మడి అందాల రచ్చ అదిరిపోయింది. చూపించాల్సిన వరకూ ఎక్స్ పోజ్ చేస్తూ.. దాచిపెట్టాల్సిన వరకూ కనుమరుగు చేస్తూ.. ఈ సుందరాంగి ఓ లాంగ్ గౌన్ లో తెగ మెరిసిపోయింది. ఇంతవరకూ ఓకే కానీ.. ఆ డ్రెస్సు లెంగ్త్ విషయంలోనే కామెడీ అయిపోయింది.

న్యూయార్క్ వెళ్లి మరీ స్వచ్ఛ్ భారత్ కు ప్రచారం చేస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఏదో రోడ్లను శుభ్రం చేస్తున్నట్లు ఆ పొడవాటి దుప్పటి ఏంటండీ బాబూ అంటూ జోకులేస్తున్నారు. అఫ్ కోర్స్.. ఇలాంటి వాటిని పట్టించుకునే తీరిక దీపికా పదుకొనేకు లేదు. అందుకే ఇలాంటివాటికి రియాక్ట్ కావడం లేదు. ఇక పద్మావత్ తో ఫిమేల్ సెంట్రిక్ మూవీతో ఇండియాలోనే బిగ్గెస్ట్ విక్టరీ అందుకున్న ఈ భామ.. త్వరలో షారూక్ ఖాన్ మూవీ జీరో లో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు