ఆ పాపకు నమ్రత రికమండేషన్ ఉందట

ఆ పాపకు నమ్రత రికమండేషన్ ఉందట

ఓ బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్ లో అడపాదడపా మెరుస్తుండడం చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా భరత్ అనే నేను చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా నటించిన భామ కియారా అద్వానీ. బాలీవుడ్ లో ఈమె కెరీర్ అంతంత మాత్రంగానే సాగుతోంది. అలాంటి సమయంలో ఈ చిత్రం కోసం బాలీవుడ్ భామను వెతుక్కుంటున్నారు మేకర్స్. మహేష్ వైఫ్ నమ్రత.. కియారా ఫోటోలను చూసి..  ఈ పాత్రకు ఆమె అయితే సరిగ్గా సరిపోతుందని చెప్పిందట.

అయితే.. ఒకసారి వేరే భాషలో నటిస్తే.. మళ్లీ బాలీవుడ్ ఆఫర్స్ రావేమో అనే ఉద్దేశ్యంతో మొదట కియారా ఒప్పుకోలేదని తెలుస్తోంది. కానీ అప్పుడు స్వయంగా నమ్రత రంగంలోకి దిగి.. ఇప్పుడు ఇలాంటి ప్రాంత బేధాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పిన మహేష్ భార్య.. మంచి పారితోషికం కూడా ఇప్పించిందట. కియారాను స్వయంగా తనే అప్రోచ్ అయ్యి మరీ.. ఈ పాత్రకు ఒప్పించడం విశేషం. ఇప్పుడు భరత్ అనే నేను సక్సెస్ తర్వాత.. ఆమెకు వరుసగా ఆఫర్స్ వస్తున్న సంగతి తెలిసిందే.

మొదటి సినిమా రిలీజ్ కాకముందే.. రామ్ చరణ్- బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందే చిత్రంలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఈ ఆఫర్ కూడా నమ్రత ద్వారానే వచ్చిందట. చెర్రీ అండ్ టీంకు కియారా గురించి చెప్పి రికమెండ్ చేసిందట. ఇప్పటికే చరణ్ మూవీ కోసం ఓ రోజు షూటింగ్ చేశానని.. మెగా పవర్ స్టార్ ఎనర్జీ చూసి షాక్ అయ్యానని అంటున్న ఈ ముంబయ్ పాప కియారా అద్వానీ.. ఆయనతో షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెబుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు