పోరాటాల భోజనం పెడతావా బన్నీ?

పోరాటాల భోజనం పెడతావా బన్నీ?

ఈ సమ్మర్ లో ఇప్పటికే రంగస్థలం.. భరత్ అనే నేను అంటూ రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి. నా పేరు సూర్యతో హ్యాట్రిక్ పూర్తి చేయాలని టాలీవుడ్ తెగ ముచ్చట పడుతోంది. అయితే ఇప్పటికే వచ్చిన రామ్ చరణ్.. మహేష్ సినిమాలు ఒక విషయంలో ఓ సెగ్మెంట్ జనాలను డిజప్పాయింట్ చేశాయి.

రంగస్థలం.. భరత్ అనే నేను మూవీస్ కంటెంట్ పరంగా స్ట్రాంగ్ అయినా.. ఎక్కడా యాక్షన్ ఎపిసోడ్స్ కు మాత్రం చోటు ఇవ్వలేదు. అలాగని పూర్తిగా ఫైటింగులు లేవని కూడా కాదు. రంగస్థలంలో ఎండుగడ్డి పొలాల్లో వచ్చే ఫైట్ ఉండగా.. భరత్ అనే నేను చిత్రంలో దుర్గామహల్ థియేటర్ ఫైట్ ఉంటుంది. ఈ రెండు యాక్షన్ సీక్వెన్స్ లలో ఫైటింగుల కంటే దర్శకుడు.. ఫైట్ మాస్టర్ల క్రియేటివిటీనే ఎక్కువగా ఉంటుంది. అందుకే యాక్షన్ లవర్స్ నిరుత్సాపడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు రాబోతోన్న నా పేరు సూర్య మాత్రం ఈ విషయంలో లోటు తీర్చేసే మాదిరిగా ఉంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్.. టీజర్లలో ఈ విషయం అర్ధమవుతూనే ఉంది. పోలీస్ స్టేషన్ ఫైట్ ఒకటి ఎక్స్ ట్రార్డినరీగా ఉండనుందనే సంగతి తెలుస్తోంది.

ఇదే కాకుండా.. నా పేరు సూర్యను యాక్షన్ ఫిలింగానే రూపొందించారనే టాక్ కూడా ఉంది. పైగా డీజే మూవీలో కూడా ఎక్కువగా ఫైట్స్ చేయకుండా సినిమా ముగించేశాడు బన్నీ. తను కల్పించిన ఆ లోటు.. ఇప్పుడు బ్లాక్ బస్టర్లలో లేని యాక్షన్.. మొత్తం కలిపి చూపించే ఛాన్స్ ఉందట. అంటే చరణ్.. మహేష్ లు బ్రేక్ ఫాస్ట్.. స్నాక్స్ పెడితే.. అల్లు అర్జున్ మాత్రం ఫుల్ మీల్స్ పెట్టేలా ఉన్నాడని టాక్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు