శ్రీదేవి జీవితంపై సినిమా కాదంట‌...

శ్రీదేవి జీవితంపై సినిమా కాదంట‌...

నిజంగా అతిలోక సుంద‌రి ఉంటే ఆమె ఎలా ఉంటుందో మ‌న‌కు తెలియ‌దు కానీ... మ‌న‌కు తెలిసినంత వర‌కు అతిలోక‌సుంద‌రి శ్రీదేవినే. ప‌ద‌హారేళ్ల వ‌య‌సు సినిమాలో ఆమెను ఎలా అభిమానించామో మొన్న‌టి మామ్ సినిమా వ‌ర‌కు అలాగే అభిమానిస్తూ వ‌చ్చాం. ఆమె హ‌ఠాత్మ‌ర‌ణం అభిమానుల‌ను శ్రీదేవి కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచింది. ముఖ్యంగా ఆమె భ‌ర్త బోనీ క‌పూర్ ఆ న‌ష్టం నుంచి తేరుకోలేక‌పోతున్నాడు.

శ్రీదేవి మ‌ర‌ణించిన‌ప్ప‌టి నుంచి బోనీ క‌పూర్ ముఖంలో న‌వ్వు మాయ‌మైంది. క‌ష్ట‌ స‌మ‌యంలో అండ‌గా నిలిచిన భార్య ఇక‌పై ఉండ‌ద‌ని... ఇద్ద‌రు పిల్ల‌ల బాధ్య‌త త‌న‌దేన‌ని అర్థ‌మ‌య్యాక మ‌రింత బాధ‌లో కూరుకుపోయాడు. త‌న భార్య‌పై ప్రేమ‌ని చాట‌డానికి ఆమె జీవిత‌మే క‌థ‌గా సినిమా తీస్తాడ‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు తెలిసిందేమిటంటే బోనీ క‌పూర్ శ్రీదేవిపై సినిమాను కాదు డాక్యుమెంట‌రీను ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకోసం ప‌లు టైటిళ్ల‌ను కూడా రిజిస్ట‌ర్ చేయించాడ‌ట‌. శ్రీ శ్రీదేవి, శ్రీ, మామ్ ఇలా మూడు టైటిళ్ల‌తో పాటూ ఆమె న‌టించిన అనేక సినిమాల పేర్ల‌ను కూడా రిజిస్ట‌ర్ చేయించాడ‌ట‌. అందులో భాల్ బాజ్ - రూప్ కి రాణి చోరోంకా రాజా - జాన్ బాజ్ - మిస్ట‌ర్ ఇండియా ఇలా అనేక సినిమాల పేర్లు ముందే రిజిస్ట‌ర్ చేయించాడ‌ని మీడియాకు స‌మాచారం అందింది. అలాగే రిట‌ర్న్ ఆఫ్ మిస్ట‌ర్ ఇండియా అనే టైటిల్ కూడా రిజిస్ట‌ర్ చేయించాడ‌ట‌. ఇందులో ఏదో ఒక పేరుతో డాక్యుమెంట‌రీ తీయ‌బోతున్నాడ‌ట‌.

శ్రీదేవి తన మేనల్లుడి వివాహానికి ఫిబ్ర‌వ‌రిలో దుబాయ్ వెళ్లింది. పెళ్లి అయిన నాలుగురోజుల‌కి  ఫిబ్ర‌వ‌రి 24న హోట‌ల్‌లోని బాత్‌ట‌బ్‌లో జారిప‌డి మ‌ర‌ణించింది. ముందు అంద‌రూ కార్డియాక్ అరెస్టు వ‌ల్ల ఆమె మ‌ర‌ణించిన‌ట్టు భావించారు. కానీ పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం ఆ ప్ర‌స్తావ‌న లేక‌పోవ‌డం కేవ‌లం బాత్‌ట‌బ్‌లో మునిగి ఊపిరి ఆడ‌క‌పోవ‌డం వ‌ల్ల మ‌ర‌ణించింద‌ని ఉండ‌డం చాలా అనుమానాల‌కు తావిచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు శ్రీదేవి మ‌ర‌ణానికి స‌రైన కార‌ణం తెలియ‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English