సాయి పల్లవి 'అతి' తగ్గించాలి

సాయి పల్లవి 'అతి' తగ్గించాలి

రెండు సినిమాలు హిట్టయ్యే సరికి, యూత్‌లో క్రేజ్‌ వచ్చే సరికి సాయి పల్లవి డిమాండ్లు మొదలు పెట్టింది. పాత్ర నచ్చితేనే సినిమాలు చేస్తానంటూ చాలా చిత్రాలకి నో చెప్పింది. యువ హీరోలతో నటించాల్సి వస్తే వారికి తగిన విలువ ఇవ్వడం లేదనే కంప్లయింట్స్‌ వచ్చాయి.

'కణం'లో ఆమెకి జంటగా నటించిన నాగశౌర్య ఓపెన్‌గా సాయి పల్లవిపై కంప్లయింట్‌ చేసి ఆ చిత్రాన్ని ప్రమోట్‌ చేయడానికి కూడా రాలేదు. తాను ప్రమోట్‌ చేస్తే చాలన్నట్టుగా సాయి పల్లవి 'కణం'కి ఫుల్‌ పబ్లిసిటీ చేసింది. అయితే ఆమె ఎంత ట్రై చేసినా కానీ కణంకి అసలు ఆకర్షణే రాలేదు. ఊహించినట్టుగానే ఈ చిత్రానికి నామ మాత్రపు ఓపెనింగ్‌ కూడా రాలేదు. సాయి పల్లవి ఫ్యాక్టర్‌ వల్ల దీనికి వసూళ్లు రాకపోగా కొన్ని చోట్ల థియేటర్‌ రెంట్లు కూడా వసూలు కాలేదని ట్రేడ్‌ సమాచారం. ఛలోతో హిట్‌ కొట్టిన నాగశౌర్య కూడా ఉత్సాహంగా ప్రమోట్‌ చేస్తే సినిమాపై ఆసక్తి కలిగేదేమో.

ఎప్పుడయితే హీరోనే సినిమా ప్రచారానికి దూరంగా వున్నాడో అది హోప్‌లెస్‌ అనే భావన ప్రేక్షకుల్లో ఏర్పడింది. దక్షిణాది చిత్రాల్లో హీరోయిన్‌కి ఎక్కువ స్కోప్‌ వుండే కథలు తక్కువ. కనుక ఫలానా తరహా పాత్రలే చేస్తానంటూ కూర్చుంటే కణంలాంటి చిత్రాలే చేసుకోవాల్సి వస్తుంది. ఎంత క్రేజ్‌ వచ్చినా కానీ అది మాయం కావడానికి ఎంతో సమయం పట్టదు. ఈ సంగతి తెలుసుకుని ఆమె అతి తగ్గించుకోవాలని కణం ఫలితం చూసిన వారు కామెంట్‌ చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు