నాని.. 8 రోజులు.. 27 కోట్లు!

నాని.. 8 రోజులు.. 27 కోట్లు!

ఇదేమి లెక్కా అనుకుంటున్నారా? నాని సినిమా 'కృష్ణార్జున యుద్ధం'పై జరిగిన బిజినెస్‌ 27 కోట్లు అట. ఈ మొత్తాన్ని వెనక్కి రాబట్టడానికి పోటీ లేకుండా నానికి వున్న ఫ్రీ టైమ్‌ ఎనిమిది రోజులు. కృష్ణార్జున యుద్ధం విడుదలైన తొమ్మిదవ రోజున 'భరత్‌ అనే నేను' వస్తుంది. అది రావడంతో ఈ చిత్రం వసూళ్లు పూర్తిగా పడిపోతాయనేది లేదు కానీ ఆడియన్స్‌ దృష్టి మొత్తం అటు డైవర్ట్‌ అయిపోతుంది. ఆ తర్వాత కూడా నాని చిత్రానికి వసూళ్లు వచ్చినా కానీ భరత్‌ అనే నేను మేనియాలో వచ్చే మొత్తం ఎంతో వుండదు. కనుక ఈ ఎనిమిది రోజుల్లోనే నాని సినిమా బ్రేక్‌ ఈవెన్‌ మార్కుకి చేరువైపోతే కొన్న వారికి అంతో ఇంతో లాభాలు మిగుల్తాయి.

ఎంసిఏ చిత్రానికి వచ్చిన వసూళ్లు చూస్తే ఇది నానికి పెద్ద టార్గెట్‌ ఏమీ కాదనే చెప్పాలి. కాకపోతే ఎంసిఏ చిత్రానికి వున్నంత క్రేజ్‌ అయితే దీనికి లేదు. ఆ చిత్రానికి దిల్‌ రాజు ఫ్యాక్టర్‌కి తోడు సాయి పల్లవికి వున్న క్రేజ్‌ కూడా బాగా కలిసి వచ్చింది. కనుక ఎంసిఏతో సమానంగా ఓపెనింగ్‌ వచ్చేస్తుందనే ధీమా లేదు. ఎంసిఏ కంటే కూడా ఈ చిత్రానికి బిజినెస్‌ ఒక మూడు కోట్లు తక్కువే జరగడం గమనార్హం. అయితే నేను లోకల్‌తో మొదలు పెట్టి నాని చేసిన తదుపరి చిత్రాలన్నీ కూడా ఇరవై ఏడు కోట్ల కంటే ఎక్కువే వసూలు చేసాయి. కాబట్టి ఇది కూడా మంచి టాక్‌ తెచ్చుకున్నట్టయితే ముప్పయ్‌ కోట్లు ఎటూ పోవు అని ట్రేడ్‌ చెబుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English