'రంగస్థలం' లాంటిది కావాలంటున్నాడట!

'రంగస్థలం' లాంటిది కావాలంటున్నాడట!

సుకుమార్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో మూడవ చిత్రం ప్రపోజల్‌ చాలా కాలంగా వుంది. ఆర్య 3 చేయాలని సుకుమార్‌కి ఒక ఐడియా కూడా వుందట. కానీ ఆర్య 3 చేయడానికి అల్లు అర్జున్‌ సుముఖత చూపించకపోవడంతో ఆ ప్రాజెక్ట్‌ మెటీరియలైజ్‌ అవలేదు. సుకుమార్‌తో ఎలాంటి సినిమా చేయాలనే దానిపై ఇంతకాలం అల్లు అర్జున్‌కి క్లారిటీ లేదు. రంగస్థలం బాగా నచ్చేయడంతో తనకోసం కూడా ఒక పక్కా కమర్షియల్‌ కథని ఇలాంటి వెరైటీ ఎలిమెంట్స్‌ జోడించి చేయాలని అల్లు అర్జున్‌ చెప్పాడట.

ఇంతకాలం కమర్షియల్‌ అంశాల జోలికి పోని సుకుమార్‌ 'రంగస్థలం'లో మాత్రం తనదైన శైలి చూపిస్తూనే అచ్చమైన మాస్‌ సినిమా తీసాడు. ఒక బ్రిలియంట్‌ డైరెక్టర్‌ చేతిలో కమర్షియల్‌ సినిమా ఎంతగా ఆకట్టుకుంటుందనేది రంగస్థలం చూపిస్తోంది. ఇప్పటికీ హౌస్‌ఫుల్స్‌తో రన్‌ అవుతోన్న ఈ చిత్రం సుకుమార్‌ తదుపరి చిత్రంపై చాలా అంచనాలు పెంచేసింది. తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్‌తోనే చేసే అవకాశాలు ఎక్కువ వుండడంతో అతను కోరిన విధమైన కథకోసం సుకుమార్‌ ఆలోచనలు మొదలు పెట్టాడట.

రంగస్థలం చిత్రానికి పని చేసిన రచయితల బృందమే సుకుమార్‌ నెక్స్‌ట్‌ సినిమాకి కూడా వుంటారు. నా పేరు సూర్య తర్వాత ఫలానా సినిమా చేయాలంటూ ఖచ్చితంగా కమిట్‌ కాలేదు కనుక సుకుమార్‌ స్క్రిప్ట్‌ రెడీ అయితే బన్నీ కూడా ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ బ్యానర్లోనే చేసే అవకాశాలెక్కువే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు