‘మగధీర’ను కొట్టేసి.. ‘శ్రీమంతుడు’ను దాటేసి..

 ‘మగధీర’ను కొట్టేసి.. ‘శ్రీమంతుడు’ను దాటేసి..

భారీ అంచనాల విడుదలైన ‘రంగస్థలం’.. వసూళ్ల విషయంలో అంచనాల్ని దాటి ఎక్కడికో వెళ్లిపోయింది. ఫుల్ రన్లో ‘మగధీర’ వసూళ్లను దాటుతుందన్న అంచనాలతో అభిమానులుంటే.. రెండో వారాంతానికే ‘మగధీర’తో పాటు ‘శ్రీమంతుడు’ కలెక్షన్లను సైతం ఈ సినిమా దాటేసింది. పది రోజుల్లో ‘రంగస్థలం’ వరల్డ్ వైడ్ షేర్ రూ.91.6 కోట్లకు చేరడం విశేషం.

రామ్ చరణ్ కెరీర్లో హైయెస్ట్‌గా గ్రాసర్‌గా నిలవడమే కాక.. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘మగధీర’ అప్పట్లోనే రూ.79 కోట్ల షేర్ సాధించింది. ఆ రికార్డును వీకెండ్‌కు ముందే అందుకుంది. శని, ఆదివారాల్లో తొలి వారాంతానికి దీటుగా వసూళ్లు రాబట్టిన ‘రంగస్థలం’.. ఏకంగా 90 కోట్ల మార్కును దాటేసింది. దీంతో ‘శ్రీమంతుడు’ రికార్డు కూడా బద్దలైపోయింది.

తొలి వారాంతం తర్వాత కుడా ‘రంగస్థలం’ జోరేమీ తగ్గలేదు. ఈ వీకెండ్లో విడుదలైన కొత్త సినిమా ‘చల్ మోహన్ రంగ’ పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో ‘రంగస్థలం’ హౌస్ ఫుల్ కలెక్షన్లతో సాగింది. తెలుగు రాష్ట్రాల వరకే ఈ చిత్రం రూ.67 కోట్ల షేర్ రాబట్టడం విశేషం తొలి పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి’ మినహా ఏ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు.

రెండో వీకెండ్లో ఈ సినిమా జోరు చూస్తే నాన్-బాహుబలి రికార్డు బద్దలు కావడం పక్కాగా కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఖైదీ నంబర్ 150’ రూ.105 కోట్లతో రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. వచ్చే వీకెండ్లో ‘రంగస్థలం’ ఆ రికార్డును దాటేయొచ్చేమో. ఈ గురువారం విడుదల కానున్న నాని సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ టాక్‌ను బట్టి ఫైనల్‌గా ‘రంగస్థలం’ ఎంత వసూళ్లు రాబడుతుందన్నది ఆధారపడి ఉంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు