250 కోట్ల బడ్జెట్టా?? బాబూ రాజమౌళి...

250 కోట్ల బడ్జెట్టా?? బాబూ రాజమౌళి...

రాజ‌మౌళి... రామ్ చ‌ర‌ణ్‌- ఎన్ టీ ఆర్ ల‌తో క‌లిసి ఫోటో దిగిన‌ప్ప‌టి నుంచి అనేక ర‌కాల రూమ‌ర్లు వ‌స్తూనే ఉన్నాయి. వీరి కాంబినేష‌న్‌లో మ‌ల్టీస్టార‌ర్  సినిమా వ‌స్తుంద‌నేది ఇప్పుడు అధికారికంగా ప్ర‌క‌టించ‌డంతో అలాంటి రుమార్లు మ‌రిన్ని పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా కోసం అయ్యే బ‌డ్జెట్‌ను రాజ‌మౌళి ఫిక్స్ చేసేశాడంటూ ఓ వార్త ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఈ సినిమాకి డివీవీ దాన‌య్య నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మ‌ధ్య‌నే దాన‌య్య‌ని క‌లిసి... పూర్తి క‌థ‌ను వివ‌రించిన జ‌క్క‌న్న‌... సినిమాకి 250 కోట్ల బ‌డ్జెట్ అవుతుంద‌ని ఎస్టిమేష‌న్ చెప్పిన‌ట్టు చెబుతున్నారు. అయితే ఇంత భారీ బ‌డ్జెట్‌తో సినిమా అంటే దాన‌య్యకి చాలా క‌ష్ట‌మైన విష‌యం. ఆయ‌న బ్యాన‌ర్ ఇప్ప‌టిదాకా వ‌చ్చిన చిత్రాల‌లో ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు- కొరిటాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న ‘భ‌ర‌త్ అనే నేను’ సినిమానే భారీ బ‌డ్జెట్ మూవీ. అది కూడా మ‌హా అయితే 50 నుంచి 60 కోట్ల లోపే ఉంటుంది. అలాంటి నిర్మాత ఇంత భారీ బ‌డ్జెట్‌లో సినిమా రూపొందించ‌డం సాధ్య‌మ‌య్యే ప‌నేనా...అనేది అనుమాన‌మే!

రామ్ చ‌ర‌ణ్ ఇంకా క‌థ కూడా విన‌లేద‌ని చెప్పేశాడు. అంటే జ‌క్క‌న్న ఇంకా పూర్తి క‌థ‌ను సిద్ధం చేసే ప‌నిలో ఉన్నాడ‌ని కూడా టాక్ వినిపిస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో బ‌డ్జెట్ ఫిక్స్ అయ్యింద‌నే వార్త‌ల్లో ఎంత‌వ‌ర‌కూ నిజం ఉంద‌నేది తేలాల్సి ఉంది. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ - బోయ‌పాటి శ్రీ‌ను సినిమాతో... ఎన్ టీ ఆర్‌- త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్త‌యిన త‌ర్వాత రాజ‌మౌళి సినిమా మొద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. ఎనీవే.. #RRRలో ఈ బడ్జెట్ వార్తను ఒక #rumour గా వేసుకోండి!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు