రెండో రోజూ రంగస్థలం రీసౌండ్‌

రెండో రోజూ రంగస్థలం రీసౌండ్‌

మొదటి రోజు వసూళ్లలో చరణ్‌ సినిమాల్లో రికార్డు సృష్టించిన రంగస్థలం వసూళ్లు రెండవ రోజున కూడా మోత మోగిస్తున్నాయి. అన్ని చోట్ల తొంభై నుంచి వంద శాతం వసూళ్లు నమోదయ్యాయని ట్రేడ్‌ రిపోర్ట్స్‌ వస్తున్నాయి. పబ్లిక్‌ టాక్‌ చాలా చాలా పాజిటివ్‌గా వుండడానికి తోడు ఈ సినిమా చూడాలనే ఆసక్తి ముందుగానే రగిలించి వుంచడం వల్ల రంగస్థలం బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తోంది.

ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజునే 1.25 మిలియన్‌ డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం శనివారానికి రెండు మిలియన్ల మార్కు చేరిపోతుందని అంచనా. ఇదే జోరులో మూడు మిలియన్లు వసూలు చేసి నాన్‌ బాహుబలి రికార్డు కూడా కైవసం చేసుకుంటుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నైజాంలో తక్కువ షోలు, తక్కువ థియేటర్లు అయినా కానీ చరణ్‌ సినిమాల్లో కొత్త రికార్డు నెలకొల్పిన రంగస్థలం రెండవ రోజు కూడా స్ట్రాంగ్‌ నోట్‌లో స్టార్ట్‌ అయింది.

అంతటా రంగస్థలం ఫీవర్‌ పీక్స్‌లో వున్న నేపథ్యంలో మొదటి వారాంతానికి సెన్సేషనల్‌ నంబర్స్‌ రావడం ఖాయమని తేలిపోయింది. తొలి వారం తిరిగేసరికే బ్రేక్‌ ఈవెన్‌ మార్క్‌ చేరిపోతుందని లోకల్‌ ట్రేడ్‌ సర్కిల్స్‌ ఘంటాపథంగా చెబుతున్నాయి. మొత్తానికి బాక్సాఫీస్‌ వద్ద మెగా ఫాన్స్‌ చాలా కాలంగా ఎదురుచూస్తోన్న మెగా పవర్‌స్టార్‌ టైమ్‌ స్టార్ట్‌ అయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు