‘ప్ర‌స్థానం’ సినిమాని ఇంకా వదల్లేదా..

‘ప్ర‌స్థానం’ సినిమాని ఇంకా వదల్లేదా..

‘ప్ర‌స్థానం’ సినిమా వ‌చ్చి, దాదాపు 8 ఏళ్లు గ‌డిచిపోయింది. దేవ‌క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద‌గా క‌లెక్ష‌న్లు రాబ‌ట్ట‌క‌పోయినా మంచి చిత్రంగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను... అనేక‌  అవార్డుల‌ను గెలుచుకుంది. ఆ సినిమా వ‌చ్చి ఇన్నేళ్లు గ‌డుస్తున్నా, ఇంకా ఆ సినిమా జ్ఞాపకాల నుంచి బ‌య‌టికి రాలేక‌పోతున్నాడు ద‌ర్శ‌కుడు దేవ‌క‌ట్టా.

‘ప్ర‌స్థానం’ సినిమా త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట‌గా ‘ఆటోన‌గ‌ర్ సూర్య‌’ సినిమా చేశాడు దేవ‌క‌ట్టా. అనేక వాయిదాలు ప‌డుతూ విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘోరంగా ప‌రాజయం చెందింది. ఆ త‌ర్వాత మంచు విష్ణుతో రీమేక్ ‘డైన‌మెట్‌’ సినిమా తీశాడు. మంచి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ రూపొందిన ఈ సినిమా స‌రైన ప్ర‌మోష‌న్ లేక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డింది.

యూట్యూబ్‌లో మాత్రం మంచి వ్యూస్ రాబ‌డుతోంది. ఆ త‌ర్వాత సినిమాలేవీ చేయ‌లేక‌పోయిన దేవ‌క‌ట్టా... మ‌ళ్లీ ‘ప్ర‌స్థానం’ సినిమా గురించే ఆలోచిస్తున్నాడు. ఈ సినిమాను హిందీలో తీయాల‌నే క‌సితో ఉన్నాడు. తెలుగులో సాయికుమార్ చేసిన పాత్ర‌ను బాలీవుడ్‌లో సంజ‌య్ ద‌త్ చేస్తున్నాడు. ఈ సినిమాలో న‌టించ‌డ‌మే కాకుండా నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు సంజ‌య్ ద‌త్‌. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం మేలో విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ఒక టాలెంటెడ్ డైరక్టర్.. ప్రస్థానం వచ్చి ఇన్నేళ్ళయినా.. ప్రస్థానం గురించే చెబుతుంటుంటే.. సినిమా లవ్వర్లకు ఏదో చిన్న వెలితిగా ఉంది. కాదంటారా?

ఈ సినిమా త‌ర్వాత బాహుబ‌లి నిర్మాత‌ల నిర్మాణంలో ఓ సినిమా, ద‌ర్శ‌కుడు క్రిష్‌, రాజీవ్ రెడ్డి సార‌థ్యంలో ఓ సినిమా చేసేందుకు చేయ‌బోతున్నాడు.  ఈ సినిమా కూడా ప్ర‌స్థానం సినిమాలాగే పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా ఉండ‌బోతుంద‌ట‌!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు