ఆ సినిమాలకి దూరంగా హీరోలు

ఆ సినిమాలకి దూరంగా హీరోలు

అర్జున్‌రెడ్డితో స్టార్‌ అయిన విజయ్‌ దేవరకొండ సినిమా అంటే ఇప్పుడు యూత్‌లో పిచ్చ క్రేజ్‌. అతని సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అతని మలి చిత్రం టాక్సీవాలా రిలీజ్‌ అయ్యేలోగా విజయ్‌ నటించిన మరో సినిమా 'ఏ మంత్రం వేసావె' విడుదలకి సిద్ధమైంది. ఎప్పుడో పెళ్లి చూపులకి ముందు వచ్చిన అవకాశాన్ని వాడుకుని హీరోగా నటించేసిన విజయ్‌కి ఇప్పుడు ఆ సినిమా తప్పించుకోలేని నొప్పిగా తయారైంది.

ఎప్పుడో ఆగిపోయిన ఆ సినిమాని విజయ్‌కి ఇప్పుడున్న క్రేజ్‌ని వాడుకుని రిలీజ్‌ చేస్తున్నారు. అయితే నిర్మాణ విలువల నుంచి ప్రతీది చీప్‌గా కనిపిస్తోన్న ఈ చిత్రం విజయ్‌కి మచ్చగానే మిగిలేట్టు వుంది. అయితే ఇప్పుడు ఆ సినిమా విడుదలకి అడ్డు పడలేడు కనుక సైలెంట్‌గా వుండిపోయాడు. కాకపోతే ప్రమోషన్లకి దూరంగా వుంటూ తన సినిమాని తానే డిస్‌ఓన్‌ చేసేసుకున్నాడు. ఈ హీరో కథ ఇలా వుంటే, నాగశౌర్య మరో కారణం మీద తన సినిమాకి దూరమయ్యాడు.

కణం సినిమాలో నటించిన నాగశౌర్యకి ఆ చిత్రం షూటింగ్‌ టైమ్‌లో హీరోయిన్‌ సాయి పల్లవి నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయట. తనకి అసలు కనీస గౌరవం ఇవ్వలేదని, తనని లెక్క చేయలేదని, నిర్మాతలని బాగా ఏడిపించిందని ఓపెన్‌గానే విమర్శించాడు. అతడిని తెలీకుండా ఇబ్బంది పెట్టి వుంటే సారీ అని సాయి పల్లవి చెప్పింది కానీ ఆడియో వేడుకకి కూడా వెళ్లకుండా ఈ చిత్రానికి 'ఛలో' శౌర్య పూర్తిగా దూరమయ్యాడు. దీంతో ఈ చిత్రాన్ని సాయి పల్లవి సోలోగా ప్రమోట్‌ చేస్తూ సెంటర్‌ ఆఫ్‌ ది ఎట్రాక్షన్‌గా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు