మార్కెట్ విషయంలో వరుణ్‌ తేజ్ మిస్టేక్

మార్కెట్ విషయంలో వరుణ్‌ తేజ్ మిస్టేక్

వరుణ్ తేజ్ వరుస విజయాలతో దూకుడు మీద ఉన్నాడు. ఫిదా సాధించిన బ్లాక్ బస్టర్.. రీసెంట్ గా తొలిప్రేమతో సాధించిన ఘనవిజయం.. ఈ కుర్ర హీరోను టాలీవుడ్ లవర్ బోయ్ చేసేశాయి. అదే జోష్ తో ఇప్పుడు కొత్త సినిమాకు కమిట్ అయిపోతున్నాడు.

గతేడాది ఘాజీ అంటూ డిఫరెంట్ మూవీ అందించిన సంకల్ప్ రెడ్డితో.. తన తర్వాతి చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నాడు నాగబాబు తనయుడు. ఘాజీని అండర్ వాటర్ కాన్సెప్ట్ తో తీసిన సంకల్ప్ రెడ్డి.. వరుణ్ తేజ్ సినిమా కోసం ఆకాశంలోకి వెళుతున్నాడు. హీరో ఆస్ట్రోనాట్ గా కనిపించనుండగా.. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. అయితే.. హీరో హీరోయిన్స్ మధ్య ఒక్క పాట కూడా ఉండదని తెలుస్తోంది. ఇలా డిఫరెంట్ సినిమా చేయడం నిజానికి బాగుంటుంది. కాని ఒక రకంగా వరుణ్ తేజ్ తప్పు చేస్తున్నాడనే మాట వినిపిస్తోంది. ఇలా చేయడం ద్వారా వరుణ్ తేజ్ తన మార్కెట్ ను పెంచుకునే స్కోప్ ను వదులుకుంటున్నాడని అంటున్నారు.

'ఫిదా'తో 50 కోట్ల మార్కెట్ ను అందుకున్నాడు వరుణ్ తేజ్. కానీ ఆ తర్వాత వచ్చిన తొలిప్రేమకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా.. ఆ మార్కును అందుకోలేకపోయింది. ఓ 30 కోట్లు మార్క్ దగ్గర ఆగిపోతోంది. ఇప్పుడు ఇలా ప్రయోగం చేస్తే.. మంచి సినిమా అనే పేరొచ్చినా 20 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. మార్కెట్ ను పెంచుకుంటూ పటిష్టం చేసుకోకపోవడం హీరో మిస్టేకే అవుతుంది. మరి వరుణ్ తేజ్ వ్యూహం ఎలా ఉందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు