తేజుకు టర్నింగ్ పాయింట్ అవుతుందా?

తేజుకు టర్నింగ్ పాయింట్ అవుతుందా?

పాపం మెగాస్టార్ మేనల్లుడు. వరుసగా ఒకటి రెండు కాదు.. ఏకంగా ఐదు డిజాస్టర్లు ఎదుర్కొన్నాడు. అందులోనూ చివరగా వచ్చిన ‘ఇంటిలిజెంట్’ దారుణాతి దారుణమైన ఫలితాన్నిచ్చింది. వి.వి.వినాయక్ లాంటి పెద్ద దర్శకుడిని నమ్ముకుంటే కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ అందించాడు. దీని తర్వా తేజు నటిస్తున్న సినిమాకు కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

కరుణాకరన్ ట్రాక్ రికార్డేంటో తెలిసిందే కాబట్టి దీని మీదా ఆశలు తక్కువే ఉన్నాయి. గోపీచంద్ మలినేనితో ఓ సినిమా కమిటయ్యాడు తేజు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘విన్నర్’ ఫలితమేంటో తెలిసిందే. కాబట్టి దాని మీద కూడా ప్రేక్షకుల్లో అంతగా ఆసక్తి కనిపించట్లేదు.

కానీ తేజు వీటి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుకు సైన్ చేశాడు. అదే.. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించబోయే చిత్రం. ఈ సినిమాకు స్క్రిప్టు లాక్ అయినట్లు సమాచారం. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అని అంటున్నారు. ఇప్పటిదాకా తేజు వరుసగా కమర్షియల్ టచ్ ఉన్న సినిమాలే చేశాడు. వైవిధ్యం చూపించలేకపోయాడు. ఇమేజ్ మేకోవర్ అంటూ ఏ సినిమాలోనూ జరగలేదు. ఒక మూసలో వెళ్లిపోతున్నాడన్న విమర్శలు ఎక్కువయ్యాయి.

ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి సూపర్ స్టార్లు కూడా మాస్ సినిమాలు వదిలి డిఫరెంటుగా ట్రై చేస్తున్న సమయంలో తేజు లాంటి చిన్న స్థాయి హీరో కొత్తగా ఏ ప్రయత్నం చేయకుండా ఇలా మూసలో వెళ్లిపోతోండటం ఏంటన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమయంలో యేలేటి లాంటి విలక్షణ దర్శకుడితో అతను జట్టు కట్టబోతుండటం ఆసక్తి రేకెత్తించేదే. ఈ సినిమా తేజుకు టర్నింగ్ పాయింట్ అవుతుందని.. అతడి మార్చడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు