కీరవాణి సారేంది.. అలా పంచ్ వేశారు

కీరవాణి సారేంది.. అలా పంచ్ వేశారు

థమన్... విషయమున్న మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పటికే చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. అతని తండ్రి, తల్లి, భార్య కూడా సంగీతకారులే. వాళ్లందరి దారిలోనే థమన్ చెల్లి యామిని ఘంటసాల కూడా నడిచింది. కొన్ని పాటలు కూడా పాడింది. కాగా తాజాగా ఆమె పాడిన పాటకు పరవశించి పోయిన సంగీత దర్శకుడు కీరవాణి, ఆమెను అడ్డుపెట్టుకుని శ్రేయా ఘోషల్ పై పంచ్ వేసేశాడు.

శ్రేయా ఘోషల్ గొంతుకు బాలీవుడ్డే కాదు.... టాలీవుడ్ కూడా ఫిదా అయిపోయింది. కానీ ఎందుకో శ్రేయా అవకాశాలు వస్తున్నా కూడా తెలుగులో ఎక్కువ పాటలు పాడడం లేదనే వార్తలు ఉన్నాయి. దానికి కారణం పారితోషికం కూడా కావచ్చంటున్నారు సినీ జనాలు. బాలీవుడ్ లో అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి. కాబట్టి అక్కడే సెటిలై పోయిందనుకోవచ్చు. అయితే తాజాగా యూట్యూట్ లో చలో అనే పాట పాడింది. ఆ పాటను కంపోజ్ చేసింది కీరవాణే. ఆ పాట లింక్ ను యూట్యూబ్ లో పోస్టు చేసిన కీరవాణి... పేదవాటి శ్రేయా ఈమె అని కామెంట్ పెట్టారు. అంతే శ్రేయా ఘోషల్ పై పంచ్ పడినట్టే అంటున్నారు నెటిజన్లు. ఇకపై శ్రేయా ఘోషల్ కు బదులు టాలీవుడ్ లో యామినిని తీసుకోవచ్చన్న సందేశం కూడా కావచ్చు అని భావిస్తున్నారు.

శ్రేయాకు అంతేసి పారితోషికంగా ఇచ్చి పాడించుకోలేని సంగీత దర్శకుడు యామినితో పాడించుకోవచ్చని కీరవాణి అభిప్రాయం కావచ్చు. కానీ శ్రేయా ఘోషల్ పరంగా చూస్తే మాత్రం ఆమెకు గట్టి పంచ్ పడినట్టే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు