ఆ సినిమాలో నేను లేను బాబోయ్

ఆ సినిమాలో నేను లేను బాబోయ్

అఖిల్ సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టింది సాయేషా సైగల్. అఖిల్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అది కానీ హిట్టయితే... కుర్ర హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోవచ్చనుకుంది. కానీ ఫలితం తిరగబడింది. ఆ సినిమా కథ బుర్రలకి ఎక్కక సినీజనాలు కాస్త అట్టర్ ఫ్లాప్ చేశారు. దీంతో సాయేషా మళ్లీ తెలుగు సినిమాలో కనిపించలేదు.

ఇప్పుడు ఆమె గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆమెకు తమిళంలో ఓ పెద్ద సినిమాలో అవకాశం వచ్చిందని ఒకటే పుకారు. త్వరలో సెట్స్ మీదకు వెళుతున్న మురుగదాస్ సినిమాలో ఫిమేల్ లీడ్ ఆమేనని టాక్ వచ్చింది. తమిళ స్టార్ హీరో విజయ్ 62వ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు మురుగదాస్. అందులో విజయ్ పక్కన సాయషా ఎంపిక చేశారని ఫిల్మ్ నగర్లో ఒకటే కబుర్లు. ఇదే విషయం సాయేషాను ఎంత అందంగా లేదని చెప్పిందో చూడండి.  

‘నేను విజయ్ సర్ కి పెద్ద అభిమానిని. ఈ విషయం నేను చాలా సార్లు చెప్పాను. అతనితో కలిసి నటించే అవకాశం వస్తే వదిలిపెట్టను. కానీ ఇప్పుడు మాత్రం నన్నుఎవరూ సంప్రదించలేదు’అని చెప్పింది. పరోక్షంగా ఆ అవకాశం వస్తే బాగుండునని చెప్పకనే చెప్పింది. మురుగదాస్ ఈమె రిప్లయ్ చూశాక అయినా అవకాశం ఇస్తారేమో చూడాలి. ఇకపోతే తమిళంలో ఆల్రెడీ నాలుగైదు సినిమాలు చేసేసి.. కొత్త సినిమాల కోసం వెయిట్ చేస్తోంది ఈ సుందరి. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు