జిల్ జిల్ రాణి.. జిగేల్ రాణి..

జిల్ జిల్ రాణి.. జిగేల్ రాణి..

సినిమా మొదలవ్వగానే ఆడియెన్స్ కి ఇచ్చే మొదటి కిక్ చాలా స్ట్రాంగ్ ఉండాలని కొంత మంది సినిమా వాళ్లు ఫస్ట్ హాఫ్ మొదట్లోనే స్పెషల్ సాంగ్ ని సెట్ చేసుకుంటున్నారు. లేదంటే చివర క్లైమాక్స్ వచ్చే మూమెంట్ లో మాస్ సాంగ్ ఉండాలని స్పెషల్ హీరోయిన్స్ తో ఒక సాంగ్ ని సెట్ చేస్తున్నారు. అలాగే ఆ పాటలు క్లిక్ అయ్యేలా మంచి లిరిక్స్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. స్పైసిగా కొంచెం మసాలా టెస్ట్ తగిలేలా గేయ రచయితలు పెన్నుకు పదును పెడుతున్నారు.

ఇక స్పెషల్ సాంగ్ లో చిందులేసే భామల పేర్లు కొంచెం కొత్తగా వినిపిస్తుంటాయి. నా పేరు మీనా కుమారి నుంచి రత్తలు రత్తలు అనే సాంగ్స్ వరకు స్పెషల్ సాంగ్స్ లలో పేర్లు క్యాచీ క్యాచీగా ఉండేలా దర్శకులు జాగ్రత్త పడ్డారు. సంగీత దర్శకులు కూడా ఆ సాంగ్స్ లలో రొమాన్స్ క్లాస్ మాస్ మెలోడీ రాగలను టచ్ చేస్తూ వచ్చారు. ఇక రీసెంట్ గా సుకుమార్ దేవిశ్రీప్రసాద్ ఇద్దరు సెట్ చేసుకున్న పాట చాలా కొత్తగా ఉండబోతోందట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న రంగస్థలం సినిమాలో స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే కనిపించబోతోన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సాంగ్ లో జిగేల్ రాణి అనే నేమ్ తో పాట సాగనుంది. జిల్ జిల్ రాణి..జిగేల్ రాణి కోసం దేవి ట్యూన్ ఎలా ఉంటుందో గాని జిగేల్ రాణి నేమ్ చాలా కొత్తగా ఉంది. హీరోలు ఇలాంటి స్పైసి నేమ్స్ తో చిందులేస్తే అభిమానులు కూడా చాలా వరకు ఫిదా అవుతారు. మరి చరణ్ జిగేల్ రాణి తో ఎలాంటి రొమాన్స్ చేస్తాడో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్  నిర్మిస్తోన్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు