భాగమతి హిట్ అనడానికి ఇదే రుజువు

భాగమతి హిట్ అనడానికి ఇదే రుజువు

సినిమా ఎంత చెత్తగా ఉన్నా సరే.. ప్రి రిలీజ్ బజ్, హైప్ ఉంటే ఆటోమేటిగ్గా ఓపెనింగ్స్ బాగానే వస్తాయి. ‘అజ్ఞాతవాసి’ లాంటి డిజాస్టర్ కూడా తొలి రోజు రూ.40 కోట్ల దాకా షేర్ వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. ఐతే సినిమా అసలు సత్తా ఏంటన్నది రెండో రోజు.. ఇంకా కరెక్టుగా చెప్పాలంటే సోమవారం తెలుస్తుంది. వీకెండ్ అయ్యాక వసూళ్లు డ్రాప్ అవ్వడం మామూలే కానీ.. ఆ డ్రాప్ ఏ స్థాయిలో ఉందన్న దాన్ని బట్టి సినిమా ఫలితంపై ఒక అంచనాకు రావచ్చు. ఈ విషయంలో ‘భాగమతి’ సూపర్ సక్సెస్ అయింది. బాక్సాఫీస్ విన్నర్ అనిపించుకుంది. ‘భాగమతి’ సోమవారం పరీక్షలో విజయవంతమైంది.

ఈ చిత్రానికి నాలుగో రోజు వరల్డ్ వైడ్ రూ.2 కోట్లకు పైగా.. తెలుగు రాష్ట్రాల్లో 1.7 కోట్ల షేర్ వచ్చింది. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీకి సోమవారం ఈ స్థాయి వసూళ్లు రావడం గొప్ప విషయమే. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని మెయిన్ థియేటర్ సుదర్శన్‌లో సోమవారం ఈ చిత్రానికి మ్యాట్నీ, సెకండ్ షోలు ఫుల్స్ అయ్యాయి. ఫస్ట్ షో కూడా 95 శాతం ఫిల్ అయింది. భారీ కెపాసిటీ ఉన్న సుదర్శన్‌లోఫుల్ అయితే రూ.1.2 లక్షల దాకా వసూలవుతుంది.

అంత పెద్ద థియేటర్లో మూడు షోలకు హాళ్లు నిండటం అంటే చిన్న విషయం కాదు. ‘భాగమతి’ హిట్ అనడానికి ఇంతకంటే రుజువు అక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లో రూ.18.5 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. అమెరికాలో ఈ చిత్రం మిలియన్ మార్కు దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే వసూళ్లు ముప్పావు మిలియన్ దాకా ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English