రాములమ్మని బీట్ చేస్తావా రాక్షసి?

రాములమ్మని బీట్ చేస్తావా రాక్షసి?

చిరంజీవి పాటలంటేనే... స్టెప్పులేయకుండా ఉండ‌లేరు మెగా ఫ్యాన్స్‌. వారి నాటిని బాగా ప‌ట్టేశాడు మెగా వారి మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్. అందుకు త‌న సినిమాల‌లో చిరంజీవి రీ మిక్స్ పాట‌ల‌ను పెట్టి చిరు లాగే డ్యాన్సులేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు. త్వ‌ర‌లో విడుద‌ల‌వ్వబోయే ఇంటెలిజెంట్ సినిమాలో చిరు ఆల్ టైమ్ హిట్ సాంగ్ వినిపించ‌బోతోంది. ఆ పాట‌కి తేజు తో పాటూ ఇర‌గదీసింద‌ట లావ‌ణ్య త్రిపాఠి.

కొండ‌వీటి దొంగ చిరు కెరీర్లో సూప‌ర్ హిట్ సినిమా. అందులో చ‌మకుచ‌మ‌కు చాం పాట‌కి విజ‌య‌శాంతి, చిరు స్టెప్పుల‌తో హోరెత్తించారు. ఇప్పుడ‌దే పాట‌కు ఈ త‌రం లావ‌ణ్య‌, తేజు స్టెప్పులేశారు. తేజు ఎలాగా డ్యాన్సు బాగానే చేస్తాడు. మ‌రి అందాల రాక్ష‌సి సంగ‌తేంటీ? పాట వీడియో చూస్తుంటే అమ్మ‌డు బాగా అల‌రించిన‌ట్టు తెలుస్తోంది. చాలా హాట్ గానూ కనిపిస్తోంది. అప్ప‌టి విజ‌య‌శాంతిని అందాల రాక్ష‌సి మ‌రిపిస్తుందో లేదో చూడాలి. ఈ పాట‌లో రాముల‌మ్మను బీట్ చేసిందో లావ‌ణ్య‌కు మ‌రిన్ని మంచి అవ‌కాశాలు రావ‌డం ఖాయం.

ఇంత‌వ‌ర‌కు లావణ్య డ్యాన్సుతో ఇర‌గ‌దీసిన పాట‌లేవీ లేవు. భ‌లేభ‌లే మ‌గాడివోయ్ లో టైటిల్ సాంగ్ కాస్త బాగానే చేసింద‌నిపించింది. త‌న‌లోని డ్యాన్స్ టాలెంట్ బ‌య‌ట‌పెట్టుకునే అవ‌కాశం వ‌చ్చింది ఇంటెలిజెంట్ లోని రీమిక్స్ పాట‌తో. ఇకపోతే ఈ పాటలో అందాలను మాత్రం భారీగా ఆరబోసినట్లు పాట తాలూకు స్టిల్స్ చూస్తే తెలుస్తోంది. మరి ఈ పాట అందాల‌రాక్ష‌సికి ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు