తొలి నాన్-రాజమౌళి హిట్ కొడతాడా?

తొలి నాన్-రాజమౌళి హిట్ కొడతాడా?

బాహుబ‌లి... ఒక విజువ‌ల్ వండ‌ర్‌. ఆ వండ‌ర్ వెనుక ఉన్న కెమెరా ప‌నిత‌నం... సెంథిల్ కుమార్ ది. ఆ సినిమా సెంథిల్‌ను ఎక్క‌డికో తీసుకెళ్లిపోయింది. స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్‌ను చేసింది. నిజానికి సెంథిల్ కెరీర్లో బాహుబ‌లి అండ్ ఇతర రాజమౌళి సినిమాలు మాత్ర‌మే భారీ హిట్స్ కొట్టాయి. ఒక్క అరుంధతి తప్పిస్తే.. అతను చేసిన ఇతర సినిమాలు అట్ట‌ర్ ఫ్లాప‌య్యాయి. అలాగే అరుంధతి సక్సెస్ ఇతని కెమెరా కంట్లో వేయలేం.

రాజ‌మౌళితో చేసిన సినిమాలు త‌ప్ప మిగ‌తా తెలుగు సినిమాల‌న్నీ సెంధిల్ కుమార్ కెరీర్లో ఫ్లాపులే. త‌కిట త‌కిట‌, గోల్కొండ హై స్కూల్‌, ర‌ఫ్ సినిమాలకు కూడా సెంథిల్ కుమారే సినిమాటోగ్రాఫ‌ర్‌. ఆ సినిమాలు వారం రోజులైనా ఆడ‌కుండా వెళ్లిపోయాయి. అయినా కూడా బాహుబ‌లి ఒక్క‌టే సెంథిల్‌ను మంచి కెమెరామెన్ గా నిల‌బెట్టేసింది. అందుకే అత‌డినే త‌మ టీమ్‌లో పెట్టుకోవ‌డానికి చాలా సినిమా యూనిట్లు సిద్ద‌మైపోతున్నాయ్‌. త‌మిళంలో హిట్ట‌యిన యాక్ష‌న్‌ థ్రిల్ల‌ర్  సినిమా క‌నిథన్‌. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నారు. నిఖిలో హీరోగా, ఠాగూర్ మ‌ధు నిర్మాత‌గా, టీఎన్ సంతోష్ ద‌ర్శ‌కుడిగా క‌నిథాన్ సినిమా రీమేక్‌కు రంగం సిద్ధ‌మైంది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్‌గా సెంథిల్‌ను ఎంపిక చేసుకున్నారు. మరి తొలి నాన్-రాజమౌళి హిట్టును కొడితే బాగుంటుందని సెంథిల్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

నిజానికి క‌నిథన్ లో కూడా విజువ‌ల్స్ హైలైట్ కాబోతున్నాయ‌ట‌. అందుకే బాహుబ‌లి కెమెరా మెన్ కావాల‌ని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ సందరు మేకర్లు తీసుకున్నార‌ట‌. చూడాలి ఈసారైనా రాజ‌మౌళి సినిమాల‌కు కాకుండా బ‌య‌టి సినిమాల‌లో సెంథిల్ మొద‌టి హిట్ కొడ‌తాడేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు