ఎన్టీఆర్-హరీష్ శంకర్.. ఒక ‘ఎమ్మెల్యే’

ఎన్టీఆర్-హరీష్ శంకర్.. ఒక ‘ఎమ్మెల్యే’

ఎమ్మెల్యే.. విడమరిచి చెబితే ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’. ఈ టైటిల్.. ఆ క్యాప్షన్.. ఎప్పుడో ఏడెనిమిదేళ్ల కిందటే ప్రచారంలోకి వచ్చాయి. ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ టైటిల్‌తో ఒక సినిమా వస్తుందన్నారు. ‘అదుర్స్’ తర్వాత ఎన్టీఆర్ చేసే సినిమా ఇదే అని కూడా వార్తలొచ్చాయి. కానీ ఏమైందో ఏమో.. ఆ టైటిల్.. ఆ సినిమా తర్వాత పక్కకు వెళ్లిపోయాయి. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ‘ఎమ్మెల్యే’ అనే సినిమా మొదలైంది. కానీ దర్శకుడు హరీష్ శంకర్ కాదు. ఉపేంద్ర మాధవ్ అనే కొత్త దర్శకుడు ఈ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. మరి హరీష్ శంకర్ ‘ఎమ్మెల్యే’కు దీనికి సంబంధం ఉందో లేదో తెలియదు.

ఐతే ‘టచ్ చేసి చూడు’ ఆడియో వేడుకలో మాట్లాడుతూ హరీష్ శంకర్.. తాను పక్కన పెట్టేసిన ‘ఎమ్మెల్యే’ గురించి మాట్లాడాడు. ‘షాక్’ సినిమాతో షాక్ తిన్నాక.. ‘మిరపకాయ్’ చేయడానికి ముందు రెండేళ్లకు పైగా ఖాళీగా ఉన్నానని.. ఆ టైంలో తాను ‘ఎమ్మెల్యే.. మంచి లక్షణాలున్న అబ్బాయి’ కథను ఎన్టీఆర్‌కు చెప్పానని హరీష్ తెలిపాడు.

ఐతే ఈ సినిమా ఎందుకు పట్టాలెక్కలేదన్నది మాత్రం నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)తో తాను ఈ సినిమా చేయాల్సిందని.. కానీ ఇన్నేళ్లుగా ఆయనతో పని చేసే అవకాశం రాలేదని.. కానీ తాను కష్టాల్లో ఉన్న ఆ రెండేళ్లు తనను ఆదరించింది బుజ్జినే అని తెలిపాడు హరీష్. ‘టచ్ చేసి చూడు’ సినిమాతో విక్రమ్ సిరికొండను దర్శకుడిగా పరిచయం చేస్తున్న బుజ్జి ఇలాగే కొత్త డైరెక్టర్లను ప్రోత్సహిస్తూ ఉండాలని.. 50 ఏళ్ల తర్వాత ఆయనకు శిల్ప కళా వేదికలో తమ దర్శకులందరూ కలిసి సన్మానం చేస్తామని హరీష్ అనడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు