పీకే గురించి పీకే సైలెన్స్ ఎందుకో?

పీకే గురించి పీకే సైలెన్స్ ఎందుకో?

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు తానే అతి పెద్ద అభిమానిన‌ని ప్ర‌క‌టించుకుంది. ఇన్స్ స్టాగ్రామ్‌, ట్విట్ట‌ర్‌ల‌లో పీకే అంటూ ఒకేటే పోస్టులు పెట్టింది. అన‌వ‌స‌ర‌మైన గొడ‌వ‌లోకి త‌ల దూర్చి మ‌రీ త‌ల‌నొప్పులు తెచ్చుకుంది. ఇంత‌కీ ఎవ‌రో గుర్తొచ్చిందా? ఇంకెవ‌రండీ.. పూన‌మ్ కౌర్‌. క‌త్తి మ‌హేష్‌-ప‌వ‌న్ మ‌ధ్య జరుగుతున్న ట్విట్ట‌ర్ వార్‌లో పీకేకు మ‌ద్ద‌తుగా వ‌చ్చి వివాదాన్ని త‌న నెత్తిన పెట్టుకుంది. ప‌వ‌న్ కు ఇంత‌గా హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన పూన‌మ్ ఇప్పుడింత సైలెంట్‌గా ఉందెందుకు? ప‌వ‌న్ చేస్తున్న ప‌నిపై అస్స‌లు స్పందించ‌లేదెందుకు?

ప‌వ‌న్ ఇంత పెద్ద రాజ‌కీయ యాత్ర‌కు బ‌య‌ల్దేరితే క‌నీసం బెస్ట్ ఆఫ్ ల‌క్ అని కూడా ట్వీటు చేయ‌లేదు. ఎప్పుడూ కూసే కోయిల.. వ‌సంతంలో కూయ‌క‌పోతే అనుమానం రాకుండా పోతుందా. అందుకే ఫిల్మ్ న‌గ‌ర్లో ఇప్పుడంద‌రూ పూన‌మ్ కౌరేంటీ పీకే టూర్ పై ఏమీ స్పందించ‌డం లేదు అని ఒక‌టే చ‌ర్చ‌లు. అన‌వ‌స‌ర విష‌యాలను నెత్తికెత్తుకోవ‌డం త‌ప్ప‌... ఇలాంటి అవ‌స‌రమైన విషయాల‌ను పిల్ల ప‌ట్టించుకోదా అని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆ గుస‌గుస‌లు పూనమ్ చెవిన ప‌డ్డాయో లేదో.

మూడు రోజుల క్రితం కూడా క‌త్తి-పీకే ఫ్యాన్స్ మ‌ధ్య ముగిసిన గొడ‌వ‌పై ఆమె ట్వీటు చేసింది. ప‌విత్రంగా ఉండాల‌నే ఆలోచ‌న ఒక శ‌క్తి... అది దైవశ‌క్తి కంటే గొప్పది... తెలుసు కోవాల్సింది ఇంకేమైనా ఉందా? ఇంకెవ‌రైనా వ‌స్తారా అని ట్వీటు చేసి పీకే ల‌వ్ అని హ్యాష్ టాగ్ పెట్టింది. అయితే జ‌న‌వ‌రి 22న ప‌వ‌న్ తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ యాత్ర ప్రారంభించాడు. అమ్మ‌డు ఎంత బిజీగా ఉందో... యాత్ర గురించి నోట్వీట్‌... నో స‌పోర్ట్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు