చాల్లే నాయనా!! రెండింటికి కంపేరిజన్ వద్దు

చాల్లే నాయనా!! రెండింటికి కంపేరిజన్ వద్దు

రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా పబ్లిసిటీ కోసమే చేస్తాడు. ఆ విషయం ఆయనే ఓపెన్ గా.. నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. అందుకోసం కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తుంటాడు. ఒక్కోసారి ఆయన మాటలు వివాదంగా మారి తెగ డిస్కషన్ అయిపోతుంటాయి. ఒకోసారి తాను అనుకున్న విషయం జనాల్లోకి వెళ్లడానికి అవసరమైతే ఆయనే వివాదాస్పద కామెంట్స్ చేస్తుంటాడు. మొత్తానికి తాను అనుకున్న విషయానికి ఓ రేంజిలో పబ్లిసిటీ రాబట్టుకుంటాడు.

తాజాగా రామ్ గోపాల్ వర్మ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ ఓ సినిమాలాంటి డాక్యుమెంటరీ తీశాడు. పోర్న్ స్టార్ మియా మాల్కోవా స్వగతంతో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (GST) పేరుతో రామ్ గోపాల్ వర్మ తీసిన ఈ మూవీ 26న ఆన్ లైన్ లోనే విడుదల కానుంది. జీఎస్టీ టీజర్ నుంచే కావాల్సినంత రచ్చ మొదలైంది. ఆమధ్య టీవీ షోలకు వెళ్లి చర్చలో పాల్గొని జీఎస్టీకి ఇంకాస్త పాపులారిటీ సంపాదించాడు. అంతటితో ఆగకుండా అదే రోజున రిలీజవుతున్న బాలీవుడ్ భారీ బడ్జెట్ ఫిలిం పద్మావత్ తో తన జీఎస్టీకి పోలిక పెట్టాడు. జీఎస్టీ సోషల్ కాంట్రవర్సీ చిత్రం కాగా.. పద్మావత్ హిస్టారికల్ కాంట్రవర్సీ చిత్రమని స్టేట్ మెంట్ ఇచ్చేశాడు.

అయినా జీఎస్టీకి వర్మ కోరుకున్న పబ్లిసిటీ వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే కావాల్సిన దానికన్నా ఎక్కువే వచ్చింది. పద్మావత్ ఏమో వందల కోట్ల బడ్జెట్ తో.. భారీ తారాగణంతో.. రోజుల తరబడి శ్రమకోర్చి తీసిన సినిమా. జీఎస్టీ ఏమో అతి తక్కువ బడ్జెట్లో.. సింపుల్ కాస్టింగ్ తో ఒక రోజు షూటుతో లాగించేసిన పోర్న్ సబ్జెక్ట్. రెండింటినీ ఒకే గాటిన కట్టేస్తే ఎలా? అందరినీ భారీ బడ్జెట్ సినిమాలు మానేసి పోర్న్ సినిమాలు చేసుకోమని సలహాలిస్తున్నాడా ఏంటి... చాల్లే వర్మా! నువ్వు కోరుకున్న పబ్లిసిటీ వచ్చేసింది కదా. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు