చరణ్ మిస్సింగ్ అంటున్న ఉపాసన

చరణ్ మిస్సింగ్ అంటున్న ఉపాసన

రామ్ చరణ్ ఇప్పుడు రంగస్థలం మూవీ ఫినిష్ చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. మొదటగా ప్లాన్ చేసుకున్నదానికంటే బాగా ఆలస్యం కావడంతో.. ఇప్పుడు వేగం పెంచాలని డిసైడ్ అయిన టీం.. పాటల పనిలో పడింది.

కొన్ని పాటలతో పాటు.. ప్యాచ్ వర్క్ ను పూర్తి చేస్తే సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయినట్లే అంటున్నారు. అయితే.. రామ్ చరణ్ ఇందుకోసం బాగానే కష్టపడాల్సి ఉంటుంది. అందుకే రాజమండ్రి పరిసరాల్లోనే ఉంటున్నాడట. న్యూఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయినప్పటి నుంచి అక్కడే ఉన్నాడు చెర్రీ. ఇలా తన భర్త పూర్తిగా షూటింగ్ కే డెడికేట్ అయిపోవడంతో.. ఉపాసన బాగా ఫీలయిపోతోంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా భలే అందంగా చెప్పింది ఉపాసన.

మెగా పవర్ తో కలిసి గతంలో.. అంటే బ్రూస్ లీ షూటింగ్ టైంలో దిగిన ఓ ఫోటోను నెట్ లో పోస్ట్ చేసిన ఉపాసన..'మిస్టర్ సి మిస్సింగ్.. ప్రపంచం రెండు భాగాల్లో ఉన్నా.. కలిసి ఉన్నట్లే' అని ట్వీట్ చేసిన ఉపాసన.. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవసరం అని చెప్పింది. అయితే.. తన భర్త గురించిన అప్ డేట్స్ ఇవ్వడంలో.. ఉపాసన చూపించే ట్యాలెంట్ అందరికీ.. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కి అయితే తెగ నచ్చేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు