హలో రిలీజ్.. చిరంజీవిలో టెన్షన్

హలో రిలీజ్.. చిరంజీవిలో టెన్షన్

‘అఖిల్’ సినిమాతో చేదు అనుభవం ఎదుర్కొన్నాడు అక్కినేని కుర్రాడు అఖిల్. ఇప్పుడతడి ఆశలన్నీ ‘హలో’ మీదే ఉన్నాయి. అతడితో పాటు నాగార్జున.. అక్కినేని ఫ్యామిలీ.. ఫ్యాన్స్ చాలా ఉత్కంఠగా ఈ చిత్ర ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్లతో పాటు మెగాస్టార్ చిరంజీవి.. మెగా ఫ్యాన్స్ సైతం ఈ సినిమా ఫలితంపై ఉత్కంఠతో ఉన్నారనే చెప్పాలి. ‘హలో’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన చిరు ‘హలో’ గురించి ఓ రేంజిలో మాట్లాడేశాడు. ఆ రోజు ఉదయమే సినిమా చూసొచ్చిన చిరు.. దీన్ని మరీ గొప్పగా పొగిడేశాడు. ఇదొక క్లాసిక్ అన్నట్లుగా మాట్లాడాడు. సినిమా నచ్చితే బాగుందని చెప్పొచ్చు కానీ.. చిరు మరీ ఓ రేంజిలో పొగిడేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

‘హలో’ సినిమాను చిరు అంతగా పొగిడేయడంతో జనాల్లో ఇందులో అంత విశేషం ఏముందో చూడాలన్న కుతూహలం కలిగింది. ఇది చిరు మీద ఒత్తిడి పెంచే విషయమే. ఇప్పుడు జనాలు సినిమా చూసి.. చిరు చెప్పినట్లుగానే ఫీలైతే ఆయన జడ్జిమెంట్ గురించి పొగుడుతారు. అలా కాకుండా చిరు చెప్పిందానికి తగ్గితే మాత్రం.. రివర్స్ అటాక్ మొదలుపెడతారు. అంతన్నాడింతన్నాడే చిరంజీవి.. అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైపోతుంది. ఈ నేపథ్యంలోనే ‘హలో’ రిజల్ట్ కోసం చిరు అండ్ కో కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. మరోవైపు అఖిల్‌తో తమ కుటుంబానికి ఎంత అనుబంధం ఉందో చిరు మొన్న రివీల్ చేశాడు. అతను తమ చిన్న కొడుకు మాదిరి అనేశాడు. దీంతో ఆ చిన్న కొడుక్కి తొలి విజయం దక్కుతుందా అన్న ఉత్కంఠ కూడా ఆయనలో ఉంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు