ఆ రచయితను కొట్టిన కృష్ణ ఫ్యాన్స్!

ఆ రచయితను కొట్టిన కృష్ణ ఫ్యాన్స్!

ఈ రోజుల్లోనే కాదు.. ఒకప్పుడు కూడా హీరోల అభిమానుల మధ్య విభేదాలుండేవి. వారి మధ్య అప్పుడప్పుడూ గొడవలూ జరిగేవి. ఇప్పుడు అభిమానుల మధ్య వైషమ్యాలు చాలా వరకు సోషల్ మీడియాకు పరిమితం అవుతున్నాయి కానీ.. ఒకప్పుడు నేరుగా బాహాబాహీకి దిగేవాళ్లు. తెలుగులో ముందుగా ఇలా అభిమానుల మధ్య పోటీ.. గొడవలు మొదలైంది ఎన్టీఆర్-ఏఎన్నార్-కృష్ణ స్టార్ హీరోలుగా వెలుగొందిన కాలంలోనే. ముందు ఎన్టీఆర్-ఏఎన్నార్ అభిమానుల మధ్య పోటీ ఉండేది. ఆ తర్వాత కృష్ణ స్టార్ హీరోగా ఎదిగాక ఎన్టీఆర్-కృష్ణ అభిమానుల మధ్య పోటీ వచ్చింది.

అప్పటి ఆ పోటీ గురించి ఇప్పుడు ప్రముఖ రచయితగా వెలుగొందుతున్న సాయిమాధవ్ బుర్రా ఒక కార్యక్రమంలో వెల్లడించాడు. తాను ఎన్టీఆర్‌కు వీరాభిమానినని.. ఐతే తాను పుట్టి పెరిగిన తెనాలిలో తానంటే కృష్ణ అభిమానులకు పడేది కాదని అతను చెప్పాడు. ఓ సందర్భంగా కృష్ణ అభిమానులు తనను కొట్టినట్లు అతను వెల్లడించాడు. ఐతే అభిమానుల మధ్య ఈ గొడవలు ఉంటాయి కానీ.. హీరోల మధ్య అలాంటివేమీ ఉండవని.. ఎన్టీఆర్-కృష్ణ చాలా సన్నిహితంగా ఉండేవారని తనకు తర్వాత తెలిసిందని సాయిమాధవ్ తెలిపాడు.

కృష్ణను స్వయంగా కలుసుకున్నాక ఆయనది ఎంత మంచి మనసో తనకు అర్థమైందని అతనన్నాడు. కృష్ణ కూతురు మంజుల దర్శకురాలిగా పరిచయం కానున్న ‘మనసుకు నచ్చింది’ సినిమాకు సాయిమాధవే మాటలు అందిస్తున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు