కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ జూన్ 3న భారీ ఎత్తున విడుదల కానుంది. తెలుగు వెర్షన్ ని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తీసుకోవడంతో మంచి రిలీజ్ దక్కనుంది. సుమారు 400 స్క్రీన్లకు పైగా ప్లాన్ చేశారని ట్రేడ్ టాక్. విజయ్ సేతుపతి – ఫహద్ ఫాసిల్ కాంబినేషన్ కావడంతో ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. పైగా క్లైమాక్స్ లో సూర్య క్యామియో స్పెషల్ సర్ ప్రైజ్ గా ఫ్యాన్స్ కి షాక్ ఇస్తుందని చెన్నై టాక్.
ఇదంతా వినడానికి బాగానే ఉంది కానీ ప్రాక్టికల్ గా కొన్ని ఇబ్బందులున్నాయి. మొదటిది ఎఫ్3 దూకుడు. నిన్న రిలీజైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసింది. ఫ్యామిలీస్ థియేటర్లకు వెళ్లిపోతున్నారు. లాజిక్స్ కంటే మేజిక్స్ కి ప్రాధాన్యం ఇచ్చే తెలుగు ప్రేక్షకులు తమను నవ్విస్తున్న వెంకీ వరుణ్ లకు కలెక్షన్లు ఇచ్చేస్తున్నారు.
సర్కారు వారి పాటతో పోలిస్తే దానికొచ్చినంత డివైడ్ టాక్ ఈ సినిమాకు సోషల్ మీడియాలో కనిపించలేదు. సో వసూళ్లు స్టడీగా ఉంటాయనే అంచనా నిజమయ్యే ఛాన్స్ ఉంది. అదే జరిగితే రెండు వారాల పాటు స్ట్రాంగ్ రన్ ఉంటుంది. ఇటువైపు విక్రమ్ చూస్తేనేమో సీరియస్ గా సాగే యాక్షన్ డ్రామా. మసాలా హీరోయిజం టైపు కమర్షియల్ టేకింగ్ ఉండదు.
లోకేష్ కనగరాజ్ మేకింగ్ తమిళ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని సాగుతుంది. అటు ఎఫ్3 కుటుంబాలనే కాదు మాస్ ని సైతం లాగేస్తోంది. అలాంటప్పుడు ఏడు కోట్ల థియేట్రికల్ బిజినెస్ ని రికవర్ చేయడం విక్రమ్ కు అంత ఈజీగా ఉండదు. పైగా ఒకపక్క అదే రోజు వస్తున్న మేజర్ కు ప్రీ పాజిటివ్ వైబ్రేషన్స్ అంతకంతా పెరుగుతున్నాయి. మరి కమల్ ఈ సవాళ్లను ఎలా దాటుతాడో చూడాలి.