కెరీర్ బెస్ట్ లిచ్చినా.. ఆలోచిస్తున్నారే!

కెరీర్ బెస్ట్ లిచ్చినా.. ఆలోచిస్తున్నారే!

ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి కూడా ఉంటాడని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. దర్శకుడిగా ఇప్పటివరకూ మూడు సినిమాలు తీశాడు. మొదట కళ్యాణ్ రామ్ తో పటాస్.. ఆ తర్వాత సాయి ధరం తేజ్ తో సుప్రీమ్.. రీసెంట్ గా రవితేజతో రాజా ది గ్రేట్. ఈ మూడు చిత్రాలు సూపర్ హిట్స్ సాధించేసి.. బ్లాక్ బస్టర్స్ అని కూడా అనిపించుకున్నాయి.

అంతే కాదు.. ఈ ముగ్గురు హీరోలకు కెరీర్ బెస్ట్ హిట్స్ గా నిలిచిన సినిమాలు కూడా అవే. ఇంతటి హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి.. ఇప్పుడు మల్టీస్టారర్ కు ప్రిపేర్ అవుతున్నానని ఇప్పటికే చెప్పాడు. ఎఫ్2 అంటూ ఫన్ అండ్ ఫ్రస్టేషన్ కాన్సెప్ట్ తో మూవీ చేయనుండగా.. ఇద్దరు హీరోలలో ఒక పాత్రకు వెంకీని ఖాయం చేసుకున్నాడు.

రెండో పాత్ర దగ్గరకు వచ్చేసరికే హీరోల లెక్క తేలడం లేదు. మొదటగా రానా అనుకున్నారు. ముందు చేస్తానన్న రానా.. తర్వాత నో అనేశాడట. ఆ తర్వాత నాని దగ్గరకు ఈ సబ్జెక్ట్ వెళ్లిందట. కానీ ఇప్పుడు నాని ఫుల్ బిజీ. డేట్స్ అడ్జస్ట్ చేయలేని కారణంగా కుదరదని అన్నాడట.

ఇప్పుడీ రెండో హీరో ఆఫర్ విజయ్ దేవరకొండ దగ్గరకు చేరిందని అంటున్నారు. అతడు కూడా ఇంకా ఏమీ చెప్పలేదట. దీంతో ఫైనల్ స్క్రిప్ట్ ప్రిపరేషన్ కు అనిల్ రావిపూడికి వెయిటింగ్ తప్పడం లేదు. తన మూడు సినిమాలకు ముగ్గురు హీరోలకు కెరీర్ బెస్ట్ ఇచ్చినా.. ఈ డైరెక్టర్ కు ఊ కొట్టడంలో హీరోలు ఎందుకు ఆలోచిస్తున్నారో అర్ధం కావడం లేదు.

అయితే.. ఆయా హీరోలకు కెరీర్ బెస్ట్ అయినా.. సుప్రీమ్.. రాజా ది గ్రేట్ మూవీలు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు పంచలేదని.. నిర్మాతలకు డబ్బులొచ్చినా.. డిస్ట్రిబ్యూటర్లకు కమర్షియల్ సక్సెస్ కాదని అంటున్నారు. అక్కడే పలువురు హీరోలు ఆలోచించుకుంటున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు