ఒకటి బయట.. మళ్లీ అక్కినేనితోనే

ఒకటి బయట.. మళ్లీ అక్కినేనితోనే

‘మనం’ సినిమాతో అక్కినేని కుటుంబానికి మరపురాని సినిమాను అందించాడు విక్రమ్ కుమార్. ఆ ఒక్క సినిమా అతడిని అక్కినేని ఫ్యామిలీకి ఎంతో చేరువ చేసేసింది. ఎవరినీ అతిగా పొగడని నాగార్జున అప్పట్లో ‘మనం’కు సంబంధించిన ఒక వేడుకలో విక్రమ్ కుమార్‌ను ఏ రేంజిలో పొగిడాడో తెలిసిందే.

విక్రమ్ కూడా ఆ సందర్భంగా చాలా ఎమోషనల్ అయిపోయాడు. అలా ‘మనం’తో అక్కినేని కుటుంబానికి చాలా చేరువైపోయిన విక్రమ్.. మధ్యలో సూర్యతో ‘24’ తీసి మళ్లీ ఆ ఫ్యామిలీ కాంపౌడ్లోకే వచ్చేశాడు. అక్కినేని అఖిల్‌తో ‘హలో’ తీశాడు. ఈ సినిమా ఇంకో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఐతే అక్కినేని వాళ్లతో విక్రమ్ జర్నీకి ఇంతటితో ఫుల్ స్టాప్ పడట్లేదు. అతను ఈ ఫ్యామిలీ హీరోతో ఇంకో సినిమా కమిటయ్యాడు. కాకపోతే ముందు బయట ఓ సినిమా చేస్తాడట. ఆ తర్వాత తన పెద్ద కొడుకు నాగచైతన్యతో విక్రమ్ సినిమా ఉంటుందని.. దాన్ని తానే నిర్మిస్తానని నాగ్ స్వయంగా వెల్లడించాడు. విక్రమ్ కుమార్‌ అల్లు అర్జున్‌తో ఒక సినిమా చేస్తాడన్నారు.

నానితో కూడా ఒక కమిట్మెంట్ ఉంది. మరి ఇమ్మీడియట్‌‌గా అతను ఎవరితో సినిమా చేస్తాడో చూడాలి. విక్రమ్ ఆల్రెడీ ‘మనం’ సినిమాలో చైతూతో పని చేశాడు. ఆ సమయానికి చైతూ బెస్ట్ పెర్ఫామెన్స్ అదే అయింది. ఇప్పుడు సోలో హీరోగా చైతూను అతనెలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి. అసలు ముందు అఖిల్‌కు అతను ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నాడన్నది ఆసక్తికరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు