ఆక్సిజన్.. 25 సార్లు వాచింగ్.. 5 సార్లు ఎడిటింగ్

ఆక్సిజన్.. 25 సార్లు వాచింగ్.. 5 సార్లు ఎడిటింగ్

ఎప్పుడో రెండేళ్ల కిందట మొదలైంది ‘ఆక్సిజన్’ సినిమా. దీని షూటింగ్ చాలా చాలా ఆలస్యమైంది. సినిమా రెడీ అయ్యాక కూడా విడుదలకు అనేక సమస్యలు తలెత్తాయి. ఐతే అన్ని అడ్డంకుల్నీ దాటుకుని ఈ గురువారమే ప్రేక్షకుల ముందుకొస్తోందీ చిత్రం. ఈ సందర్భంగా ఈ సినిమా ఎందుకు లేటైందో చెప్పాడు దర్శకుడు జ్యోతికృష్ణ.

షూటింగ్ అంతా అయ్యాక ఏడు నెలల పాటు విజువల్ ఎఫెక్ట్స్ మీద పని చేశామని.. సినిమా ఆలస్యం కావడానికి ప్రధాన కారణం అదేనని అతనన్నాడు. అలాగే సినిమా ఔట్ పుట్ బాగా రావాలనే ఉద్దేశంతో తాను.. తన తండ్రి ఎ.ఎం.రత్నం చాలా టైం తీసుకున్నామని అతనన్నాడు.

మామూలుగా తన తండ్రికి ఏ సినిమా కూడా ఒక పట్టాన నచ్చదని.. ఐతే ‘ఆక్సిజన్’ సినిమాను ఆయన ఏకంగా 25 సార్లు చూశారని.. అలా చూసే క్రమంలో మార్పులు చేర్పులు కూడా చెప్పారని జ్యోతికృష్ణ తెలిపాడు. ఇక తాను ఈ సినిమాను ఐదుసార్లు ఈ సినిమాను రీ ఎడిట్ చేశానని.. దీంతో పదో తరగతి పరీక్షను ఐదుసార్లు రాసిన ఫీలింగ్ కలిగిందని జ్యోతికృష్ణ తెలిపాడు.

ఇక ఈ సినిమాకు రకరకాల కారణాల వల్ల ఆరుగురు కెమెరామెన్లు పని చేశారని తెలిపాడు జ్యోతికృష్ణ. సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ‘ఆక్సిజన్’ కోసం ఆరు ఆణిముత్యాల్లాంటి పాటలిచ్చాడని.. కానీ సినిమాలో సెట్టవ్వక రెండు పాటలు తీసేశామని చెప్పాడతను. ప్రతి పౌరుడూ గర్వించేలాగా ‘ఆక్సిజన్’ సినిమా ఉంటుందని అతనన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు