నా 'మొగుడు' కొంప ముంచాడండీ

నా 'మొగుడు' కొంప ముంచాడండీ

తాప్సీకి ఎందుకో తెలుగు చిత్ర సీమ కలిసి రాలేదు. ఇక్కడే ఎక్కువ సినిమాల్లో నటించిన తాప్సీకి ఇంతవరకు తెలుగులో చెప్పుకోతగ్గ హిట్‌ లేదు. మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ సినిమాతో హిట్‌ వచ్చిందనుకుంటే, అందులో తాప్సీ కూడా ఉందని గుర్తున్న వాళ్లు కూడా లేరు. తమిళం, హిందీలో సక్సెస్‌ చవిచూసిన తాప్సీకి ఇప్పుడు తెలుగులో ఆఫర్లు కూడా లేవు. సినిమా చేస్తున్నప్పుడే దాని ఫలితం ఊహించడం కష్టమని, కొన్ని సినిమాలు చేస్తుండగా, చాలా గొప్ప సినిమా చేసేస్తున్నామని అనుకుంటామని, తీరా సినిమా రిలీజయ్యాక కానీ దాని రంగు తెలీదని తాప్సీ తాను నేర్చుకున్న పాఠాన్ని వివరిస్తోంది.

మొగుడు సినిమా చేస్తున్నప్పుడు దానిపై చాలా నమ్మకాలు ఉండేవట. తీరా ఆ సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల స్పందన చూసి ఖంగుతిందట. తనని బాగా నిరుత్సాహపరిచిన సినిమా అదేనని తాప్సీ అంటోంది. రీసెంట్‌గా తమిళంలో ఆరంభం సినిమాలో నటించిన తాప్సీ దాంతో సక్సెస్‌ సాధించింది. ఈ విజయంతో ఆమె తమిళంలో బిజీ అవడానికి అవకాశాలున్నాయి. తమిళ్‌ నుంచి మళ్లీ తెలుగుకి తిరిగి వచ్చిన తమన్నాలా తాప్సీ కూడా హిట్‌ అవుతుందేమో ఎవరికి తెలుసు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు