ఆ హీరో వీడియో వైరల్ అయిపోయింది

ఆ హీరో వీడియో వైరల్ అయిపోయింది

‘వరుడు' సినిమాలో విలన్ పాత్ర చేసిన తమిళ నటుడు ఆర్య గుర్తున్నాడా? ‘రాజా రాణి' లాంటి సినిమాతోనూ తెలుగు ప్రేక్షకులకు ఆర్య బాగానే పరిచయం. ఈ మధ్య తమిళంలో తన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో కొంచెం డౌన్ అయ్యాడు ఆర్య. ఇలాంటి తరుణంలో అతను ఒక వీడియోతో ఇంటర్నెట్ ను షేక్ చేశాడు. నిన్నట్నుంచి కోలీవుడ్లో ఈ వీడియో గురించే చర్చ జరుగుతోంది.

తాను తన పెళ్లి గురించి స్నేహితులతో మాట్లాడుతున్న ఒక వీడియో ఇంతకుముందు బయటికి వచ్చిందని.. నిజంగానే తాను ప్రస్తుతం పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నానని.. ఎవరికైనా తాను నచ్చితే తనకు కాల్ చేయవచ్చని ఈ వీడియోలో ఆర్య చెప్పడం విశేషం.

తనకు అమ్మాయిల విషయంలో పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ ఏమీ లేవని.. తనను ప్రేమిస్తే చాలని.. అలాంటి అమ్మాయిలు ఎవరైనా ఉంటే తనకు ఫోన్ చేయాలని చెబుతూ అతను ఫోన్ నంబర్ కూడా ఇచ్చేశాడు. ఇది ప్రాంక్ కాల్ లాంటిది కాదని.. నిజంగానే తనకు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కావాలని ఆర్య అన్నాడు. ఐతే ఈ వీడియో మీద కోలీవుడ్ సెలబ్రెటీలు చాలా సరదాగా స్పందించారు. కామెడీ చేశారు.

నిజానికి ఆర్య ఒక కొత్త టీవీ షో కోసం ఇలా చేశాడని అంటున్నారు. నిజంగా పెళ్లి చేసుకునేట్లయితే.. ఇలా నంబర్ ఇచ్చి ఫోన్ చేయమని ఆర్య లాంటి సెలబ్రెటీ అడిగే అవకాశమే లేదు. అలా అయితే అతడికి రోజూ వేలల్లో కాల్స్ వస్తాయి. వాటిని తట్టుకోవడ కష్టం. హిందీలో వచ్చిన ‘స్వయంవర్' తరహాలో తమిళంలో ఒక టీవీ షో రాబోతోందని.. దాని ప్రమోషన్ కోసమే ఆర్య ఇలా చేశాడని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు