‘అదిరింది’ టీం గిమ్మిక్ చూశారా?

‘అదిరింది’ టీం గిమ్మిక్ చూశారా?

‘మెర్శల్’ సినిమా తెలుగు వెర్షన్ గురువారం తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలోనే రిలీజైంది. ఈ సినిమాకు రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. విజయ్ గత సినిమాలు వేటికీ రానంత బజ్ దీనికి వచ్చింది. వసూళ్లు కూడా అందుకు తగ్గట్లే వచ్చాయి. తొలి రోజే రూ.1.6 కోట్ల షేర్ సాధించి ఆశ్చర్యపరిచిందీ సినిమా. తమిళ వెర్షన్ రిలీజైన మూడు వారాల తర్వాత తెలుగు వెర్షన్ రిలీజ్ చేసినా ఇలాంటి రెస్పాన్స్ ఆశ్చర్యం కలిగించే విషయమే.

దీనికి ప్రధాన కారణం ‘మెర్శల్’ విషయంలో నెలకొన్న వివాదాలు.. జరిగిన రచ్చే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో జీఎస్టీకి వ్యతిరేకంగా ఉన్న డైలాగుల మీద తమిళనాట పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే.

ఇంతకీ ఆ డైలాగులు ఏంటో చూద్దామని ఆసక్తి ప్రదర్శించిన తెలుగు ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. సినిమాలో ఆ డైలాగుల్ని మ్యూట్ చేసేయడంతో అసంతృప్తికి గురయ్యారు. ఐతే సినిమా విడుదలైన రెండో రోజుల తర్వాత ఈ చిత్ర బృందం ఆశ్చర్యకర ప్రకటన చేసింది. ఈ సినిమాలో జీఎస్టీ డైలాగుల్ని చేరుస్తున్నట్లు చెప్పింది. సెన్సార్ బోర్డు ఈ డైలాగుల విషయంలో ఆంక్షలేమీ పెట్టలేదని.. ఐతే సెన్సార్ బోర్డు అభ్యంతరం చెబుతుందేమో అని తాము డబ్బింగ్ సమయంలో దాన్ని మ్యూట్ చేసేశామని.. రిలీజ్ సమయంలో వాటిని కలిపే అవకాశం లేకపోవడంతో అలాగే వదిలేశామని తెలిపింది.

ఇప్పుడు ఆ డైలాగులు కలుపుతున్నట్లు వెల్లడించింది. ఐతే ‘అదిరింది’ టీం చెబుతున్న మాటలు నమ్మశక్యంగా అనిపించట్లేదు. ఉద్దేశపూర్వకంగానే ఇలా మ్యూట్ చేసి సినిమాను వదిలి.. ఇప్పుడు జనాల్ని మళ్లీ థియేటర్లకు ఆకర్షించడానికి రెండు రోజులు లేటుగా ఆ డైలాగుల్ని చేరుస్తూ పబ్లిసిటీ గిమ్మిక్ చేస్తున్నారేమో అంటున్నారు జనాలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English