అరవ సినిమా అదరగొట్టిందే..

అరవ సినిమా అదరగొట్టిందే..

దీపావళికి ‘మెర్శల్’తో పాటుగానే దాని తెలుగు వెర్షన్ ‘అదిరింది’ కూడా తెలుగులో రిలీజ్ కావాల్సింది. అలా రిలీజ్ అయి ఉంటే ఆ సినిమాను అప్పుడు ఆ సినిమాను ఏమాత్రం ఆదరించే వారో ఏమో కానీ.. మధ్యలో ఈ సినిమా చుట్టూ నెలకొన్న వివాదాల పుణ్యమా అని మన ఆడియన్స్‌లో దీనిపై క్యూరియాసిటీ బాగానే పెరిగినట్లుగా ఉంది.

తమిళంలో టాక్ బయటికి వచ్చేశాక.. మూడు వారాలు లేటుగా ఈ సినిమాను రిలీజ్ చేసినా.. ఇక్కడ రెస్పాన్స్ అదిరిపోయింది. ఈ చిత్రానికి తెలుగులో పెద్దగా పబ్లిసిటీ కూడా చేసింది కూడా లేదు. అయినప్పటికీ తొలి రోజు ‘అదిరింది’కి రెస్పాన్స్ అదిరిపోయింది. విజయ్ గత సినిమాలకు వేటికీ లేనంత క్రేజ్ దీనికి కనిపించడం విశేషం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దాదాపు 420 థియేటర్లలో రిలీజ్ చేయగా.. చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఉదయం నుంచే ఈ సినిమా థియేటర్లు కళకళలాడాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లలో రెస్పాన్స్ అదిరిపోయింది. సినిమాకు టాక్ కూడా బాగుండటంతో వసూళ్లు ఆశ్చర్యకర రీతిలో ఉంటాయని భావిస్తున్నారు.

శుక్రవారం ఇంకో మూడు సినిమాలు రిలీజవుతుండగా.. గురువారమే ‘అదిరింది’ని రిలీజ్ చేయడం మంచిదైంది. ఒక్క రోజైనా సరే.. ఈ సినిమా సోలోగా దుమ్ముదులిపేసింది. మరి శుక్రవారం మిగతా సినిమాల పోటీని తట్టుకుని ఏమాత్రం వసూళ్లు రాబడుతుందో చూడాలి. మొత్తానికి ఈ సినిమాపై రూ.5 కోట్ల దాకా పెట్టుబడి పెట్టిన నిర్మాత శరత్ మరార్‌కు రికవరీ కష్టమేమీ కాకపోవచ్చని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English