పవన్ సినిమాపై ఆది ఏమన్నాడంటే..

పవన్ సినిమాపై ఆది ఏమన్నాడంటే..

‘ఒక విచిత్రం’ అనే సినిమాతో ముందు తెలుగులోనే హీరోగా పరిచయమయ్యాడు సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది. కానీ ఆ సినిమా చేదు అనుభవాన్ని మిగల్చడంతో తమిళంలోకి వెళ్లిపోయాడు. అక్కడ ఎయిడ్స్ మీద తీసిన ‘మృగం’ సినిమాలో సెన్సేషనల్ పెర్ఫామెన్స్ ఇచ్చి.. ఆ తర్వాత ‘నీరం’ (తెలుగులో వైశాలి) సినిమాతో మంచి పేరు తెచ్చుకుని హీరోగా స్థిరపడ్డాడు.

కొంచెం లేటుగా తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చి.. ‘సరైనోడు’.. ‘నిన్నుకోరి’ సినిమాలతో మన ప్రేక్షకుల మనసు దోచాడు. ప్రస్తుతం అతను పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమాలో.. రామ్ చరణ్-సుకుమార్‌ల ‘రంగస్థలం’లో కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం. ఈ రెండు సినిమాల అనుభవాలపై అతను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

‘‘పవన్ సార్ సినిమాలో నా పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక ఐడియాలజీ ఉండే ఇంటెన్స్ రోల్ నాది. ఇది పూర్తిగా నెగెటివ్ రోల్ కాదు. కానీ నెగెటివ్ షేడ్స్ ఉంటాయి. ఈ పాత్రను త్రివిక్రమ్ గారు రాసిన తీరే గొప్పగా ఉంటుంది. నా కెరీర్లో ఇది మరో ప్రత్యేకమైన పాత్ర అవుతుంది. పవన్ సార్‌తో చేసిన సన్నివేశాల్ని ఎప్పటికీ మరిచిపోలేను. రిలీజ్ తర్వాత అందరూ ఆ సన్నివేశాల గురించి మాట్లాడుకుంటారు.

పవన్ కళ్యాణ్ అనే పేరు చుట్టూ ఎంతో హైప్ ఉంటుంది కానీ.. ఆయన మాత్రం చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయనతో పని చేయడం ఒక కలలాగా అనిపిస్తోంది. ఇక ‘రంగస్థలం’లో నా పాత్ర కూడా చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఈ సినిమాను సుకుమార్ సార్ మరో లెవెల్‌కు తీసుకెళ్తున్నారు. నాలోని మరో కోణాన్ని ఆ సినిమా చూపిస్తుంది’’ అని ఆది తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు