ఆ హీరోయిన్‌ పచ్చి మోసగత్తె!

ఆ హీరోయిన్‌ పచ్చి మోసగత్తె!

కంగన రనౌత్‌ తనపై ఎన్ని అభియోగాలు చేసినా కానీ సైలెంట్‌గా వుండిపోయిన హృతిక్‌ రోషన్‌ ఎట్టకేలకు స్పందించాడు. స్త్రీవాద ప్రజాస్వామ్యంలో ఆమె మాటకే ఎక్కువ విలువ వుంటుందని తనకి తెలుసునని, కానీ నిజానిజాలు తెలుసుకోకుండా ఒక అంచనాకి రాకూడదని అతను పేర్కొన్నాడు. తనతో ఏడేళ్ల పాటు రిలేషన్‌లో వున్నానని చెప్పిన కంగన వద్ద కనీసం ఒక్క ఫోటో అయినా లేదా అని హృతిక్‌ సూటిగా అడిగాడు. ఎక్కడా కంగన పేరు ఎత్తకుండా హృతిక్‌ తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ని చాలా నిశితంగా చేసాడు.

పారిస్‌లో తనతో ఎంగేజ్‌మెంట్‌ అయిందని ఆమె చెప్పిందని, అసలు ఆమె చెప్పిన టైమ్‌కి తను ఏ దేశం వెళ్లలేదని, తన పాస్‌పోర్ట్‌ చెక్‌ చేస్తే ఆ సంగతి స్పష్టమవుతుందని చెప్పాడు. నిజంగా ఎంగేజ్‌మెంట్‌ అయితే కనీసం ఒక సెల్ఫీ అయినా తీసుకోమా అంటూ హృతిక్‌ ఓపెన్‌ ఛాలెంజ్‌ విసిరాడు. ఇప్పటికే తన లాప్‌టాప్‌, ఫోన్లు ఇన్వెస్టిగేటివ్‌ టీమ్‌కి హ్యాండోవర్‌ చేసి కంగనని డిఫెన్స్‌లోకి నెట్టిన హృతిక్‌ ఆమెని గుక్క తిప్పుకోనివ్వడం లేదు.

పక్కా ప్రణాళికతో, లీగల్‌గా ఆమెని కార్నర్‌ చేస్తూనే నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే కంగన సోదరి మాత్రం హృతిక్‌ బుకాయిస్తున్నాడని, నిజాన్ని కప్పి పుచ్చడానికి తన పలుకుబడి వాడుతున్నాడని ఆరోపించింది. మళ్లీ మీడియా ముందుకి వస్తే మాత్రం కంగన సైలెంట్‌గా వుంటుందని అనుకోవడానికి లేదు. హృతిక్‌ ఓపెన్‌ అయిపోయాడు కనుక ఆమె కూడా తన సీక్రెట్స్‌ని పూర్తిగా బయటపెడుతుందనే మీడియా భావిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English