ఎన్ని హిట్స్‌ ఇచ్చినా పట్టించుకోరే పాపం

ఎన్ని హిట్స్‌ ఇచ్చినా పట్టించుకోరే పాపం

దర్శకుడిగా మారుతికి వున్న బ్రాండ్‌ వేల్యూ 'మహానుభావుడు'తో మళ్లీ రుజువవుతోంది. ఇంతవరకు అతను తీసిన సినిమాల్లో 'బాబు బంగారం' ఒకటే కాస్త నిరాశ పరిచింది. మినిమం గ్యారెంటీ సినిమాలు తీసే మారుతి 'మహానుభావుడు'తో మరో హిట్‌ కొట్టాడు. అయిదవ రోజున కూడా బ్రహ్మాండమైన వసూళ్లు సాధిస్తోన్న ఈ చిత్రం ఫుల్‌ రన్‌లో పాతిక కోట్లు రాబడుతుందని అంచనా.

వచ్చే వారంలో థియేటర్లు బాగా పెంచి, సినిమాలు లేని టైమ్‌ని క్యాష్‌ చేసుకోవడానికి ప్రణాళిక సిద్ధమైంది. ఇంత మంచి హిట్లు ఇస్తున్నా కానీ మారుతిని మాత్రం ఇంతవరకు బడా హీరోలు పిలవడం లేదు. అప్పట్లో ఒకసారి చరణ్‌ నుంచి కబురు వచ్చిందని వార్తలు వచ్చినా కానీ ఆ సినిమా నిజం కాలేదు.

తన తదుపరి చిత్రాలు కూడా నాగచైతన్య, సాయి ధరమ్‌ తేజ్‌లతోనే మారుతి ప్లాన్‌ చేస్తున్నాడు. ఇంకా మధ్య శ్రేణి హీరోలు మాత్రమే అతడంటే మక్కువ చూపిస్తున్నారు. టాప్‌ హీరోలు వచ్చి అతనికి ఛాన్స్‌ ఇస్తే తప్ప మారుతి పెద్ద రేంజ్‌కి వెళ్లలేడు.

పదిహేను కోట్ల లోపు సినిమాలు మాత్రమే మారుతి చేతిలో పెడుతోన్న నిర్మాతల్లో ఎవరైనా అతడి మీద ఎక్కువ నమ్మకం పెడితే మారుతి కూడా టాప్‌ డైరెక్టర్ల సరసన చేరతాడేమో. ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా ఏ టాప్‌ డైరెక్టర్‌కీ తీసిపోని టాలెంట్‌ వున్నా కానీ ఆ 'ఒక్క ఛాన్స్‌' మాత్రం మారుతి తలుపు తట్టడం లేదు పాపం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English