చైతూ హ్యాట్రిక్ కొడ‌తాడా?

చైతూ హ్యాట్రిక్ కొడ‌తాడా?

ప్రేమ‌మ్‌, రారండోయ్ వేడుక చూద్దాం వంటి వ‌రుస హిట్ల‌తో మంచి ఊపుమీదున్నాడు నాగ చైత‌న్య‌. చైతూ హీరోగా రూపొందిన  'యుద్ధం శరణం' సినిమా ఈ నెల 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. చైతూ ఫ్రెండ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ పాత్రను పోషించాడు. జ‌గ‌ప‌తి బాబుకు లెజెండ్ గుర్తింపు తెచ్చిన త‌ర‌హాలోనే శ్రీ‌కాంత్ కు ఈ సినిమా గుర్తింపు తెస్తుంద‌ని ద‌ర్శ‌కుడు కృష్ణ అంటున్నాడు. ఆయన పాత్రను చాలా కొత్తగా డిజైన్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం చైతూ సినిమాకు పోటీగా అల్ల‌రి న‌రేష్ హీరోగా న‌టించిన మేడ మీద అబ్బాయి శుక్ర‌వారం విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన పైసా వ‌సూల్ ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డం చైతూకు క‌లిసొచ్చే అంశం. మేడ మీద అబ్బాయి నుంచి యుద్ధం శ‌ర‌ణం కు పెద్ద పోటీ ఎదురుకాక‌పోవ‌చ్చు. ఆంధ్ర‌ .. తెలంగాణ రాష్ట్రాల్లో 17 కోట్లు .. ఓవర్సీస్ తో పాటు ఇతర ప్రాంతాలు కలుపుకుని మరో 3 కోట్లు థియేటర్స్ రైట్స్ క‌లిపి  'యుద్ధం శరణం' చిత్రానికి ఇరవై కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. అయితే, చైతూ ఈ సినిమాతో అయినా 20 కోట్ల మార్కెట్ ను దాటాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. బడ్జెట్ ఒక పరిథిలో ఉండేలా చూసుకుంటూ ఈ సినిమాను సాయి కొర్రపాటి నిర్మించాడు. దీంతో, కొద్దిగా పాజిటివ్ టాక్ వ‌చ్చినా ఈ సినిమా హిట్ అవ‌డం ఖాయమని ట్రేడ్ విశ్లేష‌కుల అంచ‌నా. 'ప్రేమమ్' .. 'రారండోయ్ వేడుక చూద్దాం'తో సక్సెస్ లను అందుకున్న చైతూ, ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు