ప్లానింగ్‌ సురేష్‌ది, సక్సెస్‌ రాణాది

ప్లానింగ్‌ సురేష్‌ది, సక్సెస్‌ రాణాది

పక్కాగా ప్లాన్‌ చేసి మార్కెటింగ్‌ చేస్తే, సరిగ్గా రిలీజ్‌ ప్లాన్‌ చేసుకుంటే కాంపిటీషన్‌తో సంబంధం లేకుండా సక్సెస్‌ సాధించవచ్చునని దిల్‌ రాజు చాలా సార్లు నిరూపించాడు. 'ఖైదీ నంబర్‌ 150', 'గౌతమిపుత్ర శాతకర్ణి' లాంటి చిత్రాలతో పోటీ వున్నా 'శతమానం భవతి'కి సంక్రాంతికి ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నాడు దిల్‌ రాజు. ఇప్పుడు 'నేనే రాజు నేనే మంత్రి' విషయంలో సురేష్‌ బాబు సేమ్‌ టు సేమ్‌ స్ట్రాటజీ ఫాలో అయి మిగిలిన చిత్రాలతో సంబంధం లేకుండా తన సినిమాని సక్సెస్‌ చేసుకున్నారు.

సినిమా బడ్జెట్‌ తక్కువ కావడంతో ఓపెనింగ్స్‌ బాగా వస్తే సేఫ్‌ అయిపోతుందని తెలుసు. థియేటర్ల పరంగా ఈ చిత్రానికి ఎక్కువ కేటాయించుకుని మిగిలిన చిత్రాలతో తలనొప్పి రాకుండా చూసుకున్నారు. ఇక మిగతాది రాణా చూసుకున్నాడు. ప్రమోషన్స్‌లో ఏ హీరో చేయనంత అగ్రెసివ్‌ పబ్లిసిటీ చేసిన రాణా తన పాత్ర వరకు పరిపూర్ణ న్యాయం చేసి ఆకట్టుకున్నాడు.

ఈ చిత్రం చూసిన వారు తేజ డైరెక్షన్‌ పట్ల మిక్స్‌డ్‌గా రియాక్ట్‌ అవుతున్నా కానీ రాణా పర్‌ఫార్మెన్స్‌కి మాత్రం ఏకగ్రీవంగా మార్కులేస్తున్నారు. ఈ చిత్రం సక్సెస్‌ క్రెడిట్‌లో లయన్‌ షేర్‌ తండ్రీ కొడుకులు ఇద్దరికే చెందుతుందని ట్రేడ్‌ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు