సమంతలా ఒక రౌండ్‌ వేసుకుంటుందట

సమంతలా ఒక రౌండ్‌ వేసుకుంటుందట

సమంత తర్వాత తెలుగు సినిమా రంగంలో టాప్‌ హీరోయిన్‌ అనిపించుకున్న రకుల్‌ ఇక్కడ అందరు టాప్‌ హీరోలతో నటించేయగానే సమంత మాదిరిగా తమిళ చిత్ర సీమపై దృష్టి పెట్టింది. తమిళంలో ఇప్పుడు రకుల్‌కి స్టార్‌ హీరోలతో అవకాశాలు వస్తున్నాయి.

స్పైడర్‌, జయ జానకి నాయక రూపంలో తనకి ఇక్కడ ఇంకా పెద్ద సినిమాలు వస్తూనే వున్నా కానీ ఇక్కడ పూర్తిగా ఫేడవుట్‌ అయ్యేవరకు రకుల్‌ ఎదురు చూడడం లేదు. ఇంకా ఇక్కడ టాప్‌లో వుండగానే తమిళంలో ఒక రౌండ్‌ వేయడానికి వెళ్లింది. ముందుగా కార్తీతో ఒక చిత్రం చేస్తోన్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి త్వరలో సూర్యతో జత కట్టే అవకాశం వచ్చినట్టు సమాచారం. గౌతమ్‌ మీనన్‌ తీసే సినిమాలో రకుల్‌ హీరోయిన్‌ అని కోలీవుడ్‌ మీడియా అంటోంది.

అలాగే విజయ్‌తో మురుగదాస్‌ ప్లాన్‌ చేస్తోన్న సినిమాకి కూడా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ని కన్సిడర్‌ చేస్తున్నారట. ఈ రెండు సినిమాలు ఓకే అయినట్టయితే ఇక అజిత్‌, ధనుష్‌, విక్రమ్‌ అంటూ అందరు తమిళ టాప్‌ హీరోలతోను ఒక్కో సినిమా చేసేసరికి మరో నాలుగైదేళ్లు హ్యాపీగా గడిచిపోతాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు